Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 20, 2018 | Last Updated 11:22 am IST

Menu &Sections

Search

జూన్ సెకండ్ వీక్ లో వస్తున్న ‘టాక్సీవాలా’!

జూన్ సెకండ్ వీక్ లో వస్తున్న ‘టాక్సీవాలా’!
జూన్ సెకండ్ వీక్ లో వస్తున్న ‘టాక్సీవాలా’!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న వారు వేళ్ల మీద లెక్కపెట్టవొచ్చు.  ఇండస్ట్రీలో సంవత్సరాల కొద్ది నటించినా..స్టార్ ఇమేజ్ తో వారసులుగా ఎంట్రీ ఇచ్చినా..సక్సెస్ కాలేక ఇండస్ట్రీకి దూరమైన వారు ఎంతో మంది ఉన్నారు.  కానీ కొంత మందికి మాత్రం ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ హోదా రావడం విశేషం..అలాంటి వారిలో సాయి పల్లవి, కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ లాంటి వారు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తర్వాత సందీప్ వంగ దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’సినిమాతో కమర్షియల్ హీరోగా మారిపోయాడు. 
taxiwala-movie-release-june-second-week-rahul-sank
ప్రస్తుతం  విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీ వాలా' సినిమా రూపొందింది. ఈ సినిమా ద్వారా రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.జూన్ రెండో వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ‘అర్జున్ రెడ్డి’ తరవాత విజయ్ మళ్లీ కమర్షియల్ హిట్ అందుకోలేదు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ కమర్షియల్ హీరోగా ఓ మెట్టు పైకెక్కుతాడని చిత్ర యూనిట్ చెబుతోంది.
taxiwala-movie-release-june-second-week-rahul-sank

జీఏ2 పిక్చర్స్, యు.వి.క్రియేష‌న్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్కేఎన్ నిర్మాత. ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు తదితరులు నటించారు. కాగా, చిత్ర విశేషాల గురించి తెలియజేస్తూ నిర్మాత ఎస్కేఎన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం. విజ‌య్ ఇమేజ్‌కి తగ్గట్టుగానే అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోధాన్ని పంచే విధంగా ‘టాక్సీవాలా’లో ఆయన పాత్రను దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దారు. 
taxiwala-movie-release-june-second-week-rahul-sank
డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలుస్తాయి. మంచి కథ, నటీనటుల పనితనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గొప్పగా నిర్మించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ రెండో వారంలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొన్నారు. 


taxiwala-movie-release-june-second-week-rahul-sank
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!