‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ స్థాయికి ఎదిగిపోయిన ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సాహో’ గురించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమూవీ పై తన భయాలను బయటపెట్టాడు. దర్శకుడు సుజిత్ తనకు ఈ కథ చెప్పినప్పుడు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఇంత పెద్ద సినిమాగా ‘సాహో’ మారుతుందని తాను ఊహించుకోలేదు అంటూ ఇది అత్యంత భారీ సినిమా అన్న సంకేతాలు ఇస్తున్నాడు. 
ప్రభాస్ సూపర్ బైక్ విన్యాసాలు
ఇదే సందర్భంలో ఈమూవీలోని ఫైట్స్ రేంజ్ గురించి మాట్లాడుతూ ఈమూవీలో ఫైట్స్ హాలీవుడ్ రేంజ్ లో చేయవలసి వస్తోందని ఇంత  హెవీ అండ్ రియల్ స్టంట్స్ చేయడం తన జీవితంలో ఇదే తొలిసారి అని అంటున్నాడు. అంతేకాదు తన కళ్ళ ముందే ఈసినిమాకోసం పెద్దపెద్ద వాహనాలు పెల్చేస్తున్న విషయాన్ని బయట పెడుతూ ఇప్పటి వరకు ఈమూవీ ఫైట్ సీన్స్ కోసం 28 ట్రక్కులు, 5 కార్లు పేల్చేసిన విషయాన్ని చెపుతూ తాను ఆ సన్నివేశాలను చూస్తున్నప్పుడు భయపడ్డానని ఇక తన సినిమాలో ఈ సీన్స్ చూసిన ప్రేక్షకులు తనకంటే మరింత భయపడతారు అంటూ ఈమూవీ పై అంచనాలు పెంచేస్తున్నాడు.
స్టయిలీష్ థ్రిల్లర్‌గా సాహో
ముఖ్యంగా ఈమూవీలో అత్యంత కష్టమైన బైక్ చేజింగ్ సీన్ ను గురించి మాట్లాడుతూ తన జీవితంలో ఎప్పుడూ అంత స్పీడ్ గా తాను బైక్ డ్రైవ్ చేయలేదని అంటూ ‘బాహుబలి’ కోసం తొమ్మిది కిలోల బరువు పెరిగితే ‘సాహో’ కోసం తాను తన బరువు తగ్గించుకోవడానికి పడ్డ పాట్లు  వివరించాడు. ఈ సినిమాలో తాను స్లిమ్ గా కనిపించడానికి డైటింగ్ చేస్తూ టోటల్ గా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం మానేశాను అంటూ తన డైటింగ్ సీక్రెట్ ను బయట పెట్టాడు.

తాను ఈసినిమాలో బాగా నటిస్తూ ఉన్నా సమస్యల్లా హిందీతో వస్తోందని హిందీలో డైలాగ్స్ చెప్పడం చాలా కష్టంగా ఉంది అంటూ తనకు హిందీ రాయడం చదవడం వచ్చినా సరిగ్గా లోకల్ యాసతో హిందీలో మాట్లాడలేకపోతున్నాను అంటూ తన లోపాన్ని ధైర్యంగా బయటకు చెప్పుకున్నాడు ప్రభాస్. అయితే ఈసినిమాలో నటిస్తున్న శ్రద్ధా కపూర్ నీల్ నితిన్ ముకేష్ లు తనకు హిందీ డైలాగులు ఎలా చెప్పాలి అన్న విషయమై తనకు గురువులుగా అని జోక్ చేసాడు. దుబాయ్ లో జరుగుతున్న ఈమూవీ షూటింగ్ కోసం దుబాయ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది అని అంటూ ఇక్కడ ఉండే తెల్లటి ఇసుకలో వాలీబాల్ ఆడటం తనకు హాబీగా మారింది అని అంటున్నాడు. ప్రభాస్ ఇలా తను ‘సాహో’ కోసం పడుతున్న కష్టాలను స్వయంగా వివరించడం వెనుక ఈమూవీకి జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ తో పాటు భారీ మార్కెట్ సంపాదించే ఎత్తుగడలో ఒక భాగం..  


మరింత సమాచారం తెలుసుకోండి: