అల్లు అర్జున్ అయోమయం పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. పైకి చెప్పకపోయినా ‘నాపేరు సూర్య’ ఫెయిల్యూర్ బన్నీకి కోలుకోలేని షాక్ గా మారింది. దీనితో తన భవిష్యత్ సినిమాల ఎంపికలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక పూర్తి అయోమయ పరిస్థితిలోకి బన్నీ వెళ్ళిపోయాడు అని టాక్. 
ALLUARJUN IN NAAPERUSURYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దర్శకుడు విక్రమ్ కుమార్ రెడీగా ఉన్నా అతడి సక్సస్  రికార్డు ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో విక్రమ్ కుమార్ కు ఎస్ చెప్పలేక అదేవిధంగా నో చెప్పలేక ఏమి చేయలేని అయోమయ స్థితి అని అంటున్నారు. కొరటాల శివ కోసం బన్నీ ఎన్ని రాయబారాలు చేసినా కొరటాల తన మనసులోని మాటను ఇప్పటికీ బయటపెట్టడం లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 
ALLUARJUN IN NAAPERUSURYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికితోడు ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ అందరూ బిజీగా ఉండటంతో బన్నీకి ఎవరో ఒక కొత్త డైరెక్టర్ ను నమ్మడం తప్ప వేరే పరిస్థితి లేకుండా పోయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వక్కంతంతో చేసిన ప్రయోగం విఫలం కావడంతో అల్లు అర్జున్ కొత్త దర్శకుల పేర్లు చెపితే అదిరిపోతున్నట్లు టాక్.
ALLUARJUN IN NAAPERUSURYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలాంటి పరిస్థుతులలో ఎటూ తేల్చుకోలేక ప్రస్తుతం బన్నీ హాలీడే ట్రిప్స్ లో ఉన్నట్లు సమాచారం. సరైన కథ డైరక్టర్ కాంబినేషన్ సెట్ అయ్యేదాకా బన్నీ సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. ఒకవైపు ఎన్టీఆర్ చరణ్ మహేష్ ప్రభాస్ లు ఇలా వీరంతా ఒక సినిమా వెనుక ఒక సినిమాను లైన్ లో పెడుతుంటే బన్నీ ఈ విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు అల్లు కాంపౌండ్ తమ వద్దకు వచ్చే డైరక్టర్లను కథ విషయంలో నెలల తరబడి డిస్కషన్లు చేస్తూ ఆతరువాత కథ నచ్చలేదు అని పక్కకు పెడుతున్న నేపధ్యంలో ప్రస్తుతం చాలామంది దర్శకులు అల్లు కాంపౌండ్ అన్నా బన్నీ అన్నా ఎలట్రిక్ షాక్ కొట్టినట్లు భయపడిపోతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: