జూనియర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల అయిన దగ్గరనుంచి ఈమూవీపై నెగిటివ్ ప్రచారం చేస్తూ వస్తున్న కామెంట్స్ వెనుక ఎవరు ఉన్నారో తెలియక త్రివిక్రమ్ తల పట్టుకుంటున్నట్లు టాక్. ఇప్పటికే ఈసినిమా స్క్రిప్ట్ మరియు టైటిల్ విషయంలో జూనియర్ త్రివిక్రమ్ ల మధ్య చిన్నగ్యాప్ ఏర్పడింది అన్న ప్రచారానికితోడు ఇప్పుడు ఈమూవీకి ఓవర్సీస్ మార్కెట్ లో చెప్పుకోతగ్గ స్థాయిలో బిజినెస్ ఆఫర్స్ రావడం లేదు అన్న దుష్ప్రచారం మొదలైంది.
ARAVINDA VEERARAGHAVA MOVIE FIRST LOOK PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో హడావిడిచేస్తున్న గాసిప్పుల ప్రకారం ‘అరవింద సమేత’ ఓవర్సీస్ రైట్లు 13.5 కోట్లకు అమ్మడం జరిగిందని అయితే ఈసినిమాతో కలిపి ఈమూవీని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ నాగచైతన్య శర్వానంద్ లతో తీయబోతున్న మూడుసినిమాలను కలిపి 13.5 కోట్లకు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈఇద్దరి యంగ్ హీరోల ఓవర్సీస్ మార్కెట్ మొత్తాల విలువను పక్కకు పెడితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ ఓవర్ సీస్ మార్కెట్ కు 7.5 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు అవుతుందని ఇలా ఇంతతక్కువ మొత్తానికి జూనియర్ త్రివిక్రమ్ ల మూవీ ఎందుకు అమ్ముతారు అంటూ చాలామంది షాక్ అవుతున్నారు. 
ARAVINDA VEERARAGHAVA MOVIE FIRST LOOK PHOTOS కోసం చిత్ర ఫలితం
వాస్తవానికి త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ అయిన త్రివిక్రమ్ కు ఇంకా ఓవర్సీస్ ప్రేక్షకులలో మంచిపేరు ఉందని ఈవిషయాలను పట్టించుకోకుండా ఎవరోకావాలని త్రివిక్రమ్ జూనియర్ ల ‘అరవింద సమేత’ కు ఓవర్సీస్ మార్కెట్ పలకడం లేదు అన్న గాసిప్పులు సృష్టిస్తున్నారని ఈమూవీ నిర్మాతల ఆవేదన. అయితే మహేష్ ఓవర్సీస్ మార్కెట్ తో పోల్చుకుంటే జూనియర్ ఓవర్సీస్ మార్కెట్ వీక్ అన్నవిషయం వాస్తవమే అయినా ఇంతతక్కువ మొత్తానికి ‘అరవింద సమేత’ ఓవర్సీస్ రైట్స్ ను అమ్మవలసిన పరిస్థితి ఈమూవీ నిర్మాతలకు ఎందుకు ఏర్పడుతుంది అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. 
సంబంధిత చిత్రం
ఈమధ్య కాలంలో త్రివిక్రమ్ పై దుష్ప్రచారం బాగజరుగుతోంది. త్రివిక్రమ్ వ్రాసే డైలాగ్స్ కు పదును తగ్గింది అన్నవాదన కూడ విపరీతంగా వినపడుతోంది. ‘అజ్ఞాతవాసి’ విడుదల ముందు వరకు టాప్ డైరక్టర్స్ లిస్టులో మూడవ స్థానంలో ఉన్న త్రివిక్రమ్ ఒక్క ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తో ఫెయిల్యూర్ దర్శకుల లిస్టులో తోసివేయబడటం వెనుక కుట్ర ఉంది అంటూ త్రివిక్రమ్ సన్నిహితులు బాధ పడుతున్నారు. ప్రస్తుత ఓవర్సీస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఎవరు ఆలోచించినా ‘అరవింద సమేత వీరరాఘవ’ కు 20-25 కోట్లవరకు మార్కెట్ పలుకుతుందని అయితే కేవలం ఈమూవీ మార్కెట్ కిల్ చేయడానికి ఎవరో కావాలని ఇలాంటి ఊహాజనితమైన వార్తలు ప్రచారంలోకి తీసుకువస్తూ త్రివిక్రమ్ పై తమకు ఉన్న జలసీని అంతర్లీనంగా ప్రదర్శిస్తున్నారు అంటూ త్రివిక్రమ్ సన్నిహితులు కామెంట్స్ చేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: