‘మహానటి’ మ్యానియా ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపధ్యంలో ఈమూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 40 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను వసూలు చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈమూవీని నిర్మించిన అశ్వినీదత్ కు 20 నుంచి 25 కోట్ల వరకు లాభాలు వస్తాయని ఒక ప్రాధమిక అంచనా.

ఈమూవీలో నటించిన నటీనటులందరికీ విపరీతమైన పేరు వచ్చిన నేపధ్యంలో ఈమూవీలో అక్కినేని పాత్రలో కనిపించిన నాగచైతన్య ప్రస్తావన విమర్శకులు ఎందుకు మర్చిపోతున్నారు అంటూ అక్కినేని అభిమానులు బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈమూవీలో అక్కినేని పాత్రలో నాగచైతన్య నటించిన సీన్స్ అతి తక్కువ అయినా ఆ మూడు నాలుగు సీన్స్ లోను చైతన్య బాగా నటించాడు.
NAGA CHAITANYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు బాడీ లాంగ్వేజ్ ని చాల నిశితంగా పరిశీలించి చైతన్య ఆసీన్స్ కు న్యాయం చేసాడు అని అక్కినేని అభిమానుల వాదన. అయితే ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించి జరిగిన ఏఫంక్షన్ లోను నాగచైతన్య కనిపించలేదు. దీనితో చైతూను ‘మహానటి’ యూనిట్ పక్కకు పెట్టి మర్చిపోయిందా లేదంటే చైతన్య తనకు తానుగా ‘మహానటి’ ప్రమోషన్ ఈవెంట్స్ కు దూరంగా ఉన్నాడా అన్న సందేహాలు అక్కినేని కుటుంబ అభిమానులను వెంటాడుతున్నాయి. 
DIRECTOR NAG ASHWIN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికితోడు ఈసినిమాను ప్రమోట్ చేస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ అదేవిధంగా ఈమూవీ నిర్మాతలు స్వప్నా దత్ ప్రియాంక దత్ లు తాము మీడియా సంస్థలకు ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలలో ఎక్కడ నాగచైతన్య పేరును ప్రస్తావించక పోవడం అక్కినేని అభిమానులను మరింత ఆశ్చర్యపరుస్తోంది. దీనికితోడు ఈమూవీ సక్సస్ గురించి అదేవిధంగా తన పాత్ర గురించి చైతన్య కూడ ఎక్కువగా ఎక్కడ మాట్లాడిన సందర్భాలు కనిపించడం లేదు. దీనితో ‘మహానటి’ టీమ్ చైతూను గుర్తించ లేదా అంటూ కొందరి అభిమానుల ఆవేదన..


మరింత సమాచారం తెలుసుకోండి: