ప్రముఖ సినీ దర్శకుడు బాబీ (కే.ఎస్. రవీంద్ర)పై పోలీసులు కేసు నమోదు చేశారు. మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ఎదురుగా వెళ్తున్న ఓ కారును దర్శకుడు బాబీ ఢీ కొట్టాడు. దీంతో బాధితుడు హర్మీందర్‌ సింగ్.. బాబీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ప్రమాదంలో తన తల్లి రీత్‌కౌర్‌కు బలమైన గాయమైందన్న హర్మిందర్.. ఇదేంటని ప్రశ్నిస్తుండగానే బాబీ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపాడు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కారుతో ఢీకొట్టి, ఆపై బాధితుడిని బెదిరించిన డైరెక్టర్!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్‌పేటకు చెందిన హర్మిందర్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప సొసైటీలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి కారులో తిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి 11.30 గంటల సయమంలో వారి వాహనం జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 33 వద్దకు రాగానే, దర్శకుడు బాబీ ప్రయాణిస్తోన్న కారు వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో హర్మిందర్ కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో వెంటనే కారు దిగిన హర్మిందర్ బాబీని నిలదీశాడు.
Image result for దర్శకుడు బాబీ
అయితే బాబీతోపాటు ఉన్న మరో ముగ్గురు హర్మిందర్‌ను బెదిరించే ప్రయత్నం చేశారని అతడు తెలిపాడు. అంతేకాదు తానో పెద్ద డైరెక్టర్‌ని అని, తనకు పలువురు పెద్దలతో సంబంధాలున్నాయని చెబుతూ, పక్కనే తన ఇల్లు ఉందని, కూర్చుని మాట్లాడుకుందామని బాబీ అన్నట్టు పేర్కొన్నాడు.హర్మిందర్ తల్లి రీతు కౌర్‌కు గుండె నొప్పి రావడంతో ఆమెకు సపర్యలు చేస్తుండగా బాబీ అక్కడి నుంచి జారుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు.

మద్యంమత్తులోనే తన కారును ఢీకొట్టాడని అన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. పవర్, గబ్బర్‌సింగ్-2, జై లవకుశ వంటి చిత్రాలకు బాబీ దర్శకత్వం వహించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: