తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేసిన నటి శ్రీరెడ్డి ఆ మద్య పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.  దాంతో ఈ అమ్మడికి అప్పటి వరకు సపోర్ట్ చేసిన వారు కూడా వెనక్కి వెళ్లారు. అంతే కాదు అప్పట్లో ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారి పవన్ వర్సెస్ మీడియా మద్య పెద్ద యుద్దమే అయ్యింది.  తర్వాత శ్రీరెడ్డి ఏ ఛానల్స్ లో కూడా కనిపించలేదు.  ప్రస్తుతం ఇంట్లో నుంచే సోషల్ మాద్యమాల ద్వారా తన యుద్దాన్ని కొనసాగిస్తుంది. 
Image result for pawan sri reddy
తాజాగా పవన్ కళ్యాన్ పై  జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై విమర్శల బాణాల్ని ఎక్కుపెట్టింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జనసేన పార్టీ నిర్మాణం ఉంటుందంటూ ప్రజలతో మమేకం అవుతూ బస్ యాత్రలు చేస్తుంటే.. అది జనసేన కాదు కులసేన అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు శ్రీరెడ్డి. 

Image result for janasena

‘జనసేన పార్టీ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే కొన్ని పదవుల్ని కేటాయించారు. అయితే అవి కులాలకు అతీతంగా కేటాయిస్తే బాగుండేది. వాటిలో పవన్ ఫ్యాన్స్‌కి కూడా కొన్ని పదవులు కేటాయిస్తే బాగుండేది అంటూ.. తాను ఎందుకు జనసేన పార్టీని కులసేన పార్టీ అంటున్నానో తెల్సా అంటూ పెద్ద లిస్టే చెప్పుకొచ్చింది. 

Image result for janasena

1. జనసేన పార్టీ అధ్యక్షుడు - పవన్ కళ్యాణ్ (కాపు) 
2. జనసేన కో ఆర్డినేటర్ - మాదాసు గంగాధరం (కాపు)  
3. జనసేన అధికార ప్రతినిధి - తోట చంద్రశేఖర్ (కాపు) 
జనసేనా కోశాధికారి - మారిశెట్టి రాఘవయ్య (కాపు) 
5. జనసేనా అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ - అద్దేపల్లి శ్రీధర్ (కాపు)  
6. మరో స్పోక్స్ పర్సన్ - పార్థసారథి (కాపు) 
7. జనసేనా మీడియా ఇంచార్జ్ - పసుపులేటి హరిప్రసాద్ (కాపు) 
8. జనసేనా యువజన విభాగం ప్రెసిడెంట్ - కిరణ్ (కాపు) 
9. జనసేన కృష్ణా - గుంటూరు ఉభయాజిల్లాల ఇంచార్జ్ - ముత్తంశెట్టి కృష్ణారావు (కాపు) 


ఇలా పార్టీలో ఉన్న అత్యంత ప్రాధాన్యత పదవులు, ఉన్నతస్థానాల దగ్గరి నుంచి చివరికి జిల్లా ఇంచార్జ్‌ల వరకు ప్రతిచోటా కాపు నాయకులతో జనసేన పార్టీని నింపేశారు.  తాజాగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘మరి మీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీలో కమ్మ కులస్తులు లేరా.. వైసీపీలో రెడ్డి కులస్తులు లేరా ఆ లిస్ట్‌లో ఎంత మందికి సొంత కులస్తులకు ఎన్నిపదవులు ఇచ్చారు.. బయట కులస్తులకు ఎన్ని పదవులు కట్టపెట్టారు.. ఇకనైనా నీ కారుకూతలు అపి ముందు నిన్ను తోలుబొమ్మలాట ఆడిస్తున్న పార్టీల మీద స్టడీ చేయండి’ అంటూ కౌంటర్‌లు పేలుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: