తెలుగు ఇండస్ట్రీలో వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా ‘దేవదాసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా.  మొదటి చిత్రంతోనే కుర్రాళ్ల మనసు దోచింది ఇలియానా.  తన నడుం వొంపు సొంపులకు కుర్రకారు ఫిదా అయ్యారు.  ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన నటించి అగ్ర కథానాయికల్లో ఒకరిగా మంచి పేరు తెచ్చుకుంది గోవా బ్యూటీ.  కెరీర్ సాఫీగా సాగిపోతున్న తరుణంలోనే అనూహ్యంగా తెలుగుకు గుడ్‌బై చెప్పి హిందీ చిత్రసీమకు తరలిపోయింది.
Related image
అక్కడ బర్ఫీ రుస్తుమ్ వంటి చిత్రాలతో గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఎక్కువ కాలం అక్కడ సక్సెస్ సాధించలేక పోయింది..తిరిగి తెలుగు ఇండస్ట్రీకి రావాలని ప్రయత్నించినా..అప్పటికే కుర్ర హీరోయిన్లు పోటీగా నిలిచారు.  దీంతో ఈ భామ కొంతకాలంగా దక్షిణాదిలో పునరాగమనం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా ఈ అమ్మడు తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టబోతున్నది. రవితేజ తాజా చిత్రం అమర్ అక్బర్ ఆంటోనిలో ఇలియానాను కథానాయికగా ఎంపిక చేశారు.
Ravi Teja and Ileana D’Cruz might be working together in Amar Akbar Anthony.
వాస్తవానికి ఈ చిత్రంలో మొదట అనూఇమ్మాన్యుయెల్‌ను కథానాయికగా అనుకున్నారు. అనుకోని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో ఇలియానాకు కథానాయికగా తీసుకున్నారు. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇలియానా తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్న గోవా బ్యూటీ ఈసారి మంచి సక్సెస్ సాధిస్తుందా..కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.   గతంలో ఆమె రవితేజతో కిక్ ఖతర్నాక్ దేవుడు చేసిన మనుషులు చిత్రాల్లో కథానాయికగా నటించింది. జూన్ నుంచి ఇలియానా అమర్ అక్బర్ ఆంటోని చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: