పాకిస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'బాహుబలి' ని ప్రదర్శించిన సందర్భంగా దర్శకుడు రాజమౌళి పాక్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై హీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.పాక్ ప్రజలు రాజమౌళిని వెల్ కమ చేసిన తీరు తనకు  నచ్చింది అని అంటూ  సినిమాలకు మాత్రమే ప్రజలను దగ్గర చేసే పవర్ ఉంది అని అంటూ ఇండియా పాకిస్థాన్  ప్రజలను దగ్గర చేసే వారధిగా 'బాహుబలి' మారడం తనకు ఆనందం కలిగించింది అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
 దుబాయ్ ప్రభుత్వ సహకారం మరువలేనిది
 ప్రస్తుతం 'సాహో' మూవీ షూటింగ్ కోసం దుబాయ్ లో ఉన్న ప్రభాస్ ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ కామెంట్స్ చేసాడు.  ఇదే ఇంటర్వ్యూలో  ‘మహానటి' సినిమా గురించి మాట్లాడుతూ  తనకు  ఎంతో నచ్చిన నటి సావిత్రి అన్న విషయాన్ని బయట పెడుతూ  తాను ఇండియా కు వెళ్ళిన వెంటనే మహానటి మూవీ చూడబోతున్న విషయాన్ని తెలియచేసాడు.  
ఈ సినిమా కోసం బరువు తగ్గాను
ఇక  బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కు తనకు  మధ్య విబేధాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై వ్యూహాత్మకంగా స్పందించాడు ప్రభాస్. మీడియాలో  వచ్చిన ఈవార్తలలో ఎలాంటి వాస్తవాలు లేవని  తనకు కరణ్ జోహార్ మధ్య  మంచి రేపో ఉంది అని ఈ విషయాలు తెలియక మీడియా వర్గాలు ఊహించుకుని వార్తలు రాస్తున్నారు అంటూ మీడియా పై కామెంట్స్ చేసాడు ప్రభాస్.
 ఇంటికి వెళ్లగానే మహానటి చూస్తాను
 రంజాన్ సీజన్ కావడంతో 'సాహో' షూటింగ్ కు  అడ్డంకులు ఏర్పడతాయని భావించిన విషయాన్ని బయటపెడుతూ ప్రభాస్  దుబాయ్ ప్రభుత్వం తమ యూనిట్ కు సహకరిస్తున్న తీరు ప్రపంచంలోని మరి ఏదేశంలోను కనిపించదు అని అంటూ తమ సినిమా షూటింగ్ కోసం అబుదాబి ప్రభుత్యం దుబాయ్ ట్రాఫిక్ కూడా నిలిపివేసిన సందర్భాన్ని అనందంగా వివరించాడు. అంతేకాదు  దుబాయ్ ప్రభుత్వం సినిమా షూటింగులకు అయ్యే  ఖర్చులో 30 శాతం  సబ్సిడీ  ఇచ్చిన విషయాన్ని మంచి జోష్ తో ప్రభాస్ తెలియచేసాడు. దీనినిబట్టి  చూస్తూ ఉంటే 'సాహో' కి దుబాయ్ అన్నివిధాలా కలిసివస్తోంది  అనుకోవాలి. .



మరింత సమాచారం తెలుసుకోండి: