మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా నేల టిక్కెట్టు. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్రయూనిట్ బాగా బిజీగా ఉన్నారు. రవితేజ ఈ సినిమాకు ఎన్నడు లేని విధంగా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు.


సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల తర్వాత కళ్యాణ్ కృష్ణ చేస్తున్న మూడవ సినిమా నేల టిక్కెట్టు. మాస్ రాజా రవితేజ మాస్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని మరి ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టడం జరిగింది. సినిమాలో రవితేజ పాత్ర కూడా డబుల్ ఎనర్జీతో ఉంటుందని అంటున్నారు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఫిదా మ్యూజిక్ డైరక్టర్ శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ అందించారు.  


ఈ సినిమా ఎమోషనల్ వైజ్ గా బాగా వర్క్ అవుట్ అవుతుందని ఉదాహరణ కు చెప్పాలంటే రాజమౌళి విక్రమార్కుడు సినిమాలో ఎమోషనల్ సీన్స్ లా ఇందులో కూడా అంత ఎమోషన్ ఉంటుందని అంటున్నారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమా రవితేజ కెరియర్ లో భారీ హిట్ గా నిలిచింది. 


ఆ సినిమాతో నేల టిక్కెట్టుకి పోలిక ఏంటని అందరు ఆశ్చర్యపడుతున్నారు. ఇక నేల టిక్కెట్టు ట్రైలర్, టీజర్ చూస్తే సినిమా తప్పకుండా రవితేజకు మంచి ఫలితాన్నే ఇస్తుందని అనిపిస్తుంది. సెన్సార్ నుండి ప్రశంసలు అందుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో మరో మూడు రోజులు ఆగితే తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: