తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొత్త ట్రెండ్ నడుస్తుంది.  మల్టీస్టారర్ మూవీస్..స్టార్ హీరోలు చిన్న హీరో..పెద్ద హీరో అనే తేడాలు లేకుండా ఆడియో ఈవెంట్స్ కి వెళ్లి సందడి చేయడం లాంటివి చేస్తున్నారు.  మహేష్ బాబు సినిమా ఈవెంట్ కి ఎన్టీఆర్ వెళ్తాడు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి మల్టీస్టారర్ చెయ్యడం, ఒకరి వెడ్డింగ్ యానివెర్సరీకి మరొకరు హాజరవడం జరిగింది. అంతేకాదు మహేష్ భార్య నమ్రతతో ఉపాసన ఫ్రెండ్ షిప్ చెయ్యడం, చెర్రీ వైఫ్ ఉపాసన ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతితో కూడా ఫ్రెండ్లి గా ఉంటున్నారు. ఆ మద్య ఫ్యాన్స్ తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని చెప్పుకుంటూ తన్నుకున్న రోజులు కూడా ఉన్నాయి. 
Image result for ntr birth day charan
కానీ హీరోలు మాత్రం తెలుగు ఇండస్ట్రీల హీరలంతా ఒకే కుటుంబం అని అంటున్నారు.  రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ముగ్గురు దిగిన ఫోటో ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో, తాజాగా ఎన్టీఆర్, చరణ్, మహేష్ ల ఫోటో అంతే సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మహేష్ భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ పార్టీలో మహేష్, చరణ్, ఎన్టీఆర్ లు ఎలా సందడి చేశారో తెలిసిందే.తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజున ఎన్టీఆర్, చరణ్ లు ఎంత ప్రేమగా ఫోటో దిగారో చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో చూస్తే తెలుస్తుంది.
Image result for ntr birth day charan namrata
బ్రదర్ హ్యాపీ బర్త్ డే అంటూ ఎన్టీఆర్ ని ఉద్దేశించి చరణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపితే, తారక్.. హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ తెలిపాడు మహేష్. అయితే విడివిడిగా ఎన్టీఆర్ కి మహేష్, చరణ్ లు విషెస్ చెబితే తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్, చరణ్, మహేష్ లు ఎంతో క్లోజ్ గా ఉన్న ఫోటో బయటికి వచ్చింది.  తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: