Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 9:54 am IST

Menu &Sections

Search

సారీ స్వీటీ! ఇక నుండి నువ్వు చెప్పినట్లే వింటా! : ప్రభాస్

సారీ స్వీటీ! ఇక నుండి నువ్వు చెప్పినట్లే వింటా! : ప్రభాస్
సారీ స్వీటీ! ఇక నుండి నువ్వు చెప్పినట్లే వింటా! : ప్రభాస్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారతీయ సినీరంగంలో తాజా హిట్ పెయిర్ ఎవరు అని అడిగితే టక్కున వచ్చే సమాధానం "ప్రభాస్ – అనుష్క" అని టపీమంటూ చెప్పేస్తారు అభిమాన ప్రేక్షకులు. వీరు జోడీ గా కలసి ఎనిమిదేళ్ళ పాటు నాలుగు సినిమాల్లో అంటే బిల్లా, మిర్చి, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్లో 2009 నుండి 2017 మద్య నటించారు.  వీరిది విజయవంతమైన జోదీయే జోడియే కాదు, వీరు చేసిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ ను బ్రేక్ చెసే సక్సెస్ సాధించాయి.  పై నాలుగు సినిమాలను చూసిన అభిమానులు వీరు పెళ్ళి చేసుకుంటే చాలా బాగుంటుందని అంటారు అలా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన జంట ఇది.
tollywood-news-bollywood-news-abudabi-uae-shooting
ఇక ప్రభాస్ లేటెస్ట్ గా ‘సాహో’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నెల రోజుల నుంచి దుబాయ్, అబుదాబీల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రత్యేక యాక్షన్ సీక్వెన్స్ లు హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించాలన్న ఉద్దేశంతో 90 కోట్ల రూపాయిలతో యాక్సన్ ద్శ్యాలు చిత్రీకరించారని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రభాస్ ఈ యాక్షన్ సీన్స్ కోసం రాజీ పడకుండా సాజత్వానికి ద్గ్గర్లో ఉండటానికి రియాల్టీ కోసం డూప్ లేకుండా ప్రభాస్ షూటింగ్ లో పాల్గొన్నాఉ. 
tollywood-news-bollywood-news-abudabi-uae-shooting
గత మూడువారాలుగా ఇక్కడ తీరికలేని షూటింగ్ షెడ్యూల్‌ తో బిజీగా ఉన్న ప్రభాస్, పలు కీలక యాక్షన్ సన్నివేశాల్లో దుమ్ము దులిపేశాడని చిత్ర యూనిట్ పేర్కొంది. అన్ని యాక్షన్ సన్ని వేశాలను గ్రాఫిక్స్ అవసరం లేకుండా రియల్‌గానే చిత్రించామని వెల్లడించింది. కీలక సన్నివేశాల చిత్రీకరణ ముగియడంతో ‘సాహో’ బృందం యూఏయీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ ఈ సినిమాకు చెందిన పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. 
tollywood-news-bollywood-news-abudabi-uae-shooting
ప్రభాస్ మాట్లాడుతూ, "మూడు వారాల నుంచి మేం ఇక్కడే షూటింగ్ జరుపుతున్నాం. ఇప్పటివరకు షూటింగులో చాలా కార్లు, ఎస్‌యూవీలు, ట్రక్కులు ధ్వంసం చేసేశాం. రెండేళ్ల కిందటే హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బాట్స్‌ తో యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేశాం. అందుకు అబుదాబీ సరైన ప్రాంతమని కెన్నీ అబు సూచించారు. దీంతో కీలక సన్నివేశాలన్నీ ఇక్కడే చిత్రీకరించాం. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలన్నీ 90శాతం రియల్‌గా చూపించేందుకు నిజమైన కార్లతోనే యాక్షన్ సన్నివేశాలు చేశాం" అని తెలిపారు. 
tollywood-news-bollywood-news-abudabi-uae-shooting

ఈ షూటింగులో 27 కార్లు, 5 ట్రక్కులు ధ్వంసం చేశాం. యాక్షన్ సన్నివేశాలను సీజీఐతో గ్రాఫిక్స్‌లో చూపించం. అన్నీ రియల్ సన్నివేశాలే ఉంటాయి. వాస్తవానికి మేం 70శాతం సీజీఐ, 30శాతం రియల్ అనుకున్నాం. అబుదాబీ వచ్చేసరికి అన్నీ నిజంగానే చేయాలని నిర్ణయించాం. ఇప్పటివరకు ఇలాంటి సన్నివేశాలు ఎవరూ చూసి ఉండరు" అని ప్రభాస్ అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ప్రభాస్ చెప్పినట్లు 27 కార్లు కాదు, మొత్తం 37 కార్లు ధ్వంసం చేశామని తెలిపారు. 
tollywood-news-bollywood-news-abudabi-uae-shooting
పూర్తిగా మారిపోయా: "బాహుబలి సినిమాలో ధీరుడిలా కనిపించేందుకు బరువు పెరిగి కండలు పెంచాను. అయితే, నాకు ప్రతి సినిమాలో అదే పాత్రలో కనిపించాలని లేదు. అందుకే, ఈ సినిమాకోసం డైట్ మార్చి స్టైల్ మార్చాను" అని తెలిపారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజీత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ ప్రతినాయకుడుగా నటిస్తున్నాడు. 
tollywood-news-bollywood-news-abudabi-uae-shooting
ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ప్రభాస్ కు రెండు సార్లు బలంగా గాయాలయ్యాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న స్వీటీ అనుష్క వెంటనే దుబాయ్ వెళ్లి ప్రభాస్ కు క్లాస్ తీసుకుందట. డూప్ లేకుండా రిస్కీ షాట్లు చెయ్యొద్దని, ఏదైనా జరిగితే అభిమానులు ఎంతో బాధపడతారని నచ్చజెప్పిందట. ప్రభాస్ కూడా డూప్ ని పెట్టుకుంటానని ప్రామిస్ కూడా చేశాడని సమాచారం. ఎవరు ఎంత  చెప్పినా వినని  ప్రభాస్ అనుష్క చెప్పిందంతా "రాముడు మంచి బాలుడు" అనేలా బుద్ధిగా విన్న ప్రభాస్‌ అలాగే డూప్‌ని పెట్టుకుంటానంటూ అనుష్కకు వాగ్దానం చేశాడట.
tollywood-news-bollywood-news-abudabi-uae-shooting
అయితే గత చాలా కాలంగా ప్రభాస్ – అనుష్కల పెళ్లి గురించి వార్తలు వస్తుంటే అనుష్క అవి ఏమి పట్టించుకోకుండా తన బెస్ట్ ఫ్రెండ్ ని కలవటానికి వెళ్లింది. మరి ఆ వార్తలు నిజం కాదని ఇద్దరూ ఖండిస్తున్నా ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడటం లేదు. ప్రభాస్ మీద అంత శ్రద్ధ తీసుకోవడంతో సోషల్ మీడియాలో విసృతంగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ లో మాతం అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోందనేది వీళ్లకైనా తెలుసా! అంటున్నాఉ. 

tollywood-news-bollywood-news-abudabi-uae-shooting

tollywood-news-bollywood-news-abudabi-uae-shooting
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాహుల్ గాంధి అంత హాటా! ఈ హాట్ హాట్ కత్రినా కైఫ్ కి?
తెలంగాణాలో 'కేసిఆర్ ఖేల్ ఖతం' కానుందా?
నేరస్తుడిగా నిర్దారణ కాకముందే ముద్ధాయిని ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించలేం: సుప్రీం
దీదీ మమత పాలనలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే కుప్ప కూలిన మూడు ఫ్లైఓవర్లు
ఆంధ్రప్రదెశ్ లో టిడిపి ఓటమికి బలమైన రాజకీయ వ్యూహం:  BJP రాం మాధవ్
నిజమా? చంద్రబాబు వెళ్ళేది యుఎన్ అసెంబ్లికి కాదా!  ఏమిటీ తమాషా? మరి ఎందుకీ బూటకాల నాటకాలు?
ఇంటి పేరుతో పబ్బం గడుపుతున్న రాహుల్ అంతకు మించి ఎలాంటి అర్హత సామర్ధ్యం లేవు!
నరేంద్ర మోడీ రాజకీయ వ్యక్తిగత జీవితంపై రాఫేల్ అవినీతి మరక !
భారత్ - పాక్ రాజకీయమైనా, సినిమాలైనా చివరకు క్రీడలైనా - ఇది దాయాది పోరు కదా!!!
‘ఓటు కు నోటు కేసు’ ఈడీ  ఉచ్చు  బిగిస్తుందా?
చంద్రబాబు స్వంత భవనాల నిర్వహణ సిసిటివీలు, కెమెరాల భారం ఉభయ రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలకే తలనొప్పా?
చంద్రబాబుకు షాక్!  మీకెవరికి స్పెషల్ ట్రీట్మెంట్లు ఉండవు: ధర్మాబాద్ కోర్ట్
టిఆరెస్ ఒటమికి కాంగ్రెస్ పాదాల చెంత మోకరిల్లటానికి టిడిపి సిద్దమౌతుంది : 10 సీట్లు చాలు టిడిపి
చింతమనేని టిడిపికి మోహం - కాని - తెలుగు జాతికి శిరోభారం
About the author