‘నేలటిక్కెట్టు’ మూవీ ఆడియో ఫంక్షన్లో పవన్ రవితేజ వేసుకున్న చిన్నచిన్న రంద్రాలు ఉన్న టోన్డ్ జీన్ వంక ఆశ్చర్యంగా చూస్తూ ఆ జీన్ ప్యాంటు రంధ్రాలలోకి వేలుపెట్టి కెలికిన సంఘటన కొద్దిరోజుల క్రితం సంచనలనం. దీనికి సంబంధించిన వీడియొ వైరల్ అవడమే కాకుండా అప్పట్లో పవన్ పై విపరీతంగా జోకులు కూడ పడ్డాయి. 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈవిషయానికి ఒక బూతు అర్ధం ఇస్తూ కామెంట్స్ అప్పట్లో కామెంట్స్ కూడ చేసాడు. ఇప్పుడు ఆ సంఘటన పై రవితేజ ఆలస్యంగా స్పందించాడు. ఈవారం విడుదల కాబోతున్న ‘నేలటిక్కెట్టు’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ చిలిపి తనం పై తనదైన స్టైల్ లో స్పందించాడు. 
RAVITEJA MEDIA I8NTERVIEW PHOTOS కోసం చిత్ర ఫలితం
పవన్ తన ప్యాంట్ హోల్స్ లో వేలుపెట్టాడు అని అనుకోవడం సరికాదని అది కేవలం సరదా కోసం చేసిన పని అంటూ పవన్ తీరుపై అభిప్రాయపడ్డాడు. తాను వేసుకున్న టోన్డ్ జీన్స్ పవన్ కు ఆశ్చర్యంగా అనిపించడంతో అలా ప్రవర్తించాడని దీనికి బూతు అర్ధాలు వెతకడం తనకు చాల బాధను కలిగించింది అంటూ ఆనాటి సంఘటన పై ఈనాడు స్పందించాడు మాస్ మహారాజ.
సంబంధిత చిత్రం
ఇదే సందర్భంలో పవన్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ పవన్ చాల సరదా మనిషి అని అంటూ ఎప్పుడు నవ్వుతు సరదాగా ఉండే పవన్ చేసే పనులకు వేరే అర్ధాలు వెతకడం దారుణం అని అంటున్నాడు రవితేజ. దీనితో రవితేజాకు ఇప్పుడు పవన్ చేసిన ఆనాటి చిలిపి పని ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. సినిమా ధియేటర్లలో బాల్కనీలో కూర్చునే వారికి కూడ నచ్చే సినిమా ‘నేలటిక్కెట్టు’ అంటూ మాటలు చెపుతూ మధ్యలో పవన్ చిలిపి తనాన్ని గుర్తుకు చేసుకోవడం ఆనాటి విషయాన్ని ఇప్పుడు మళ్ళీ అందరికీ గుర్తుకు చేసినట్లు అయింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: