ఈమధ్యకాలంలో రియల్ లైఫ్ లో భార్య భర్తలుగా మారిన సెలెబ్రెటీల యాడ్స్ కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. సూర్య జ్యోతిక – స్నేహ ప్రశన్న లు నటించిన యాడ్స్ కు తమిళ కన్నడ బుల్లితెర ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్న నేపధ్యంలో అలాంటి వ్యూహాన్ని మన తెలుగు బుల్లితెర పై కూడ ప్రయోగించడానికి కొన్ని ప్రముఖ కంపెనీలు చేస్తున్న ప్రయోగాలు చైతు సమంతలకు అదృష్టంగా మారుతున్నాయి. 
SAMANTHA ALONG WITH NAGACHAITANYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఒక ప్రముఖ డిపార్ట్ మెంటల్ స్టోర్స్ చైన్ యాజమాన్యం తమ వ్యాపార సంస్థను ప్రమోట్ చేస్తూ చైతు సమంతల పై తీసిన మొట్టమొదటి యాడ్ కు విపరీతమైన స్పందన రావడంతో తిరిగి అదే సంస్థ చైతన్య సమంతల పై మరికొన్ని యాడ్స్ ను చిత్రీకరించే బాధ్యత దర్శకుడు తరుణ్ భాస్కర్ కు అప్పచెప్పింది. కొత్తగా పెళ్లయిన జంటలా చైతన్య సమంతలు నటించిన ఈ యాడ్స్ ను బుల్లితెర పై మాత్రమే కాకుండా యూట్యూబ్ లో కూడ విపరీతంగా చూస్తున్నారు. 
SAMANTHA ALONG WITH NAGACHAITANYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
పెళ్ళి అయిన తరువాత చైతన్య సమంతలు నటించిన తొలి యాడ్ ఇది కావడంతో ఈ యాడ్ కు విపరీతమైన రేటింగ్స్ కూడ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాడ్స్ కు బుల్లితెర ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ ను చూసి మరిన్ని కార్పోరేట్ సంస్థలు తమ ప్రొడక్ట్స్ యాడ్స్ కోసం చైతు సమంతలకు భారీ పారితోషికాలను ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
SAMANTHA ALONG WITH NAGACHAITANYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
నిజంగానే కొత్తగా పెళ్లి చేసుకున్న కొత్త జంటలా చైతు సమంతల కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ కావడం చూసి ఈ యాడ్ కు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ కూడ మంచి జోష్ లో ఉన్నట్లు సమాచారం. ఈ యాడ్ షూటింగ్ జరుగుతున్నంత సేపు సెట్ లో చైతన్యా సమంతలు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ జోక్స్ వేసుకుంటూ ప్రవర్తించిన తీరు ఈ యాడ్ షూటింగ్ లో హైలెట్ గా మారిందని అంటున్నారు. ఏమైనా బుల్లి తెర పై కూడ ఇక రానున్న రోజులలో వీరిద్దరికి చాల యాడ్స్ వచ్చే చాన్స్ కనిపిస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: