త్రివిక్రమ్ ఇప్పటి వరకు తీసిన సినిమాలు చాలా వరకు  కాపీ సినిమా లు అని చెప్పవచ్చు. అయితే వాటికి సరైన ఆధారాలు లేక పోవడం తో పైగా ఆ సినిమాలన్నీ హిట్ టాక్ రావడం తో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే అజ్ఞాతవాసి సినిమా తో పూర్తి గా అర్ధం అయిపొయింది. పైగా అది భారీ ఫ్లాప్ ను చవిచూడటం తో త్రివిక్రమ్ మీద విమర్శలు ఒక్క సారిగా ఎక్కువైయ్యాయి. నెగటివ్ ఇమేజ్ వచ్చింది. దీనితో ఉన్న పరువు అంత ఒక్కసారిగా పోయింది. 

Image result for trivikram ntr movie

ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ హీరోగా `అర‌వింద స‌మేత` అనే సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో త‌న స్టైల్ ఫ్యామిలీ ఎమోష‌న్స్ తో తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ క‌థైనా త్రివిక్ర‌మ్ ఓన్ క్రియేటివిటీతో సిద్ధం చేసిందా? లేక కాపీ క్యాట్ అన్న‌ది రిలీజ్ వ‌ర‌కూ తెలియ‌దు. ఒక‌వేళ కాపీ అయితే మాత్రం త్రివిక్ర‌మ్ కెరీర్ ముగియ‌డం ఖాయం. అదులో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో హిట్లు ఇచ్చిన శ్రీనువైట్ల లాంటి స్టార్ డైరెక్ట‌ర్ ఒక్క‌సారిగా కుదేల్ అయ్యాడు.

Image result for trivikram ntr movie

అవ‌కాశాలు లేక కొన్నాళ్ల పాటు ఖాళీగా ఉండాల్సిన ప‌రిస్థితి వచ్చింది. అయితే అత‌ని ప్లాప్ ల‌కు ఓ అర్ధం ఉంది. అన్నీ క‌థ‌లు ఒకే జోన‌ర్లో చేస్తాడ‌ని త‌ప్ప‌..కాపీ అనేది అత‌నికి తెలియ‌న‌వి విష‌య‌మే. కానీ త్రివిక్ర‌మ్ క‌థ‌, సన్నివేశాల‌తో లిప్ట్ చేసిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. ఇదే కంటున్యూ చేస్తే క‌ష్ట‌మ‌ని ఎన‌లిస్టులు అభిప్రాయ‌ప‌డున్నారు. ఇప్పుడు టాలీవుడ్ చాలా అప్ డేట్ అయింది. ఇన్నో వేటివ్, యూనిక్ థాట్స్ తో సినిమాలు వ‌స్తున్నాయి. భారీగా స‌క్సెస్ అవుతున్నాయి. ఇలాంటి హెల్దీ వాతావ‌ర‌ణం న‌డుమ కాపీ అనే ముద్ర‌ప‌డితే తెలుగు సినిమా ప్ర‌పంచ స్థాయిలో చెడ్డ‌ది అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: