మాస్ మహారాజ రవితేజ ధియేటర్లలో కనిపిస్తే ప్రేక్షకులలో గోల మొదలైపోతుంది. క్లాస్ ప్రేక్షకుల నుండి మాస్ ప్రేక్షకుల వరకు రవితేజాకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈమధ్య కాలంలో ఇతడి హవా తగ్గిన నేపధ్యంలో తిరిగి ప్రేక్షకుల పై తన పట్టు నిలుపుకోవడానికి రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన మూవీ ‘నేలటిక్కెట్టు’. 
సంబంధిత చిత్రం
మరో రెండు రోజులలో విడుదల కాబోతున్న ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజ ‘నేలటిక్కెట్టు’ పై తన వైరాగ్యాన్ని ప్రదర్శించాడు. తన చిన్నతనంలో తణుకు దగ్గర ఉన్న తన తాతగారి ఊరిలో పది పైసలు పెట్టి ‘నేలటిక్కెట్టు’ కొనుక్కుని ఇసకలో కూర్చుని సినిమాలు చూసి ఎంజాయ్ చేసిన విషయాన్ని వివరిస్తూ ‘నేలటిక్కెట్టు’ లో ఉండే కిక్ తనకు జీవితంలో మరెక్కడా కనిపించలేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. 
RAVI TEJA IN NELA TICKET MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఈతరం వారికి ఆ ‘నేలటిక్కెట్టు’ కిక్ తెలియడం లేదని ‘చుట్టూ జనం మధ్యలో మనం లైఫ్ అంటే అలా ఉండాలి’ అన్న పాయింట్ తో తీసిన ఈమూవీలో ఒక సామాజిక అంశం ఉంది అని అంటున్నాడు. అంతేకాదు నేటి తరం ఆలోచనలు గురించి మాట్లాడుతూ భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఈ క్షణంలో బతకడం మర్చిపోతున్నారని అంటూ తన వేదాంత ధోరణిని ప్రదర్శించాడు మాస్ మహారాజ. 
RAVI TEJA IN NELA TICKET MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రస్తుత సమాజంలో చాలామంది యూత్ ముసలితనం వచ్చిన వారిని చూస్తే చాల అగౌరవంగా చూస్తున్నారని ముసలితనం అంటే చేతకాని తనం కాదు అనే సందేశం తన మూవీలో కనిపిస్తుంది అని అంటున్నాడు. అనేక సామాజిక అంశాలు ఉన్న ఈకథలోని అంశాలు ప్రేక్షకులకు నచ్చే విధంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తీసాడు అని రవితేజ చెపుతూ ఉన్నా ఈమూవీ పై ఎంత ప్రచారం చేస్తూ ఉన్నా ఇంకా సరైన క్రేజ్ ఏర్పడకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: