త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ చేస్తున్న సినిమాకు టైటిల్ గా అరవింద సమేత అని పెట్టారు. ఇక ఉపశీర్షికగా వీర రాఘవ అని పెట్టారు. అరవింద సమేత వీర రాఘవ సినిమా టైటిల్ ను చూసిన వారు వీర రాఘవ అంటూ పేర్లని విడగొట్టిన తీరుని చూస్తే కచ్చితంగా ఇందులో ఎన్.టి.ఆర్ డ్యుయల్ రోల్ చేస్తునాడని అంటున్నారు.


అంతేకాదు త్రివిక్రం తన అత్తారింటికి దారేది సెంటిమెంట్ తో అరవిదన్ సమేత టైటిల్ పెట్టినట్టు ఉన్నాడని చెబుతున్నారు. ఇక లీకైన కథ ప్రకారం వీర, రాఘవ రెండు పాత్రల్లో ఎన్.టి.ఆర్ డబుల్ ధమాకా ఇస్తున్నాడని తెలుస్తుంది. అందుకే ఒక హీరోయిన్ పూజా హెగ్దె కాగా సెకండ్ హీరోయిన్ గా ఈషా రెబ్బ నటిస్తుంది.


వీర, రాఘవ టైటిల్ లోని పేర్లని బట్టి డ్యుయల్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. ఒకవేల ద్విపాత్రాభినయం కాకున్నా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్ర అయినా అయ్యుండొచ్చని చెబుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


ఈ సినిమాకు కాస్ట్ కటింగ్ కూడా పెట్టబోతున్నారట. బడ్జెట్ కూడా అనుకున్న బడ్జెట్ కు ఒక్క రూపాయ్ కూడా ఎక్కువ ఖర్చు చేయకూడదని ఫిక్స్ అయ్యారట. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో తారక్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: