తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో అంచెలంచెలుగా పైకి ఎదిగారు. తెలుగు ఇండస్ట్రీలో మొదట చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన చిరంజీవి తన డ్యాన్స్, ఫైట్స్ తో కొత్త వరవడి తీసుకు వచ్చారు. మెగాస్టార్ స్థాయికి రావడానికి ఆయన ఎంతో కృషి చేశారని సహనటులు చెప్పడం విశేషం. తాజాగా తమిళ .. మలయాళ.. కన్నడ భాషలతో పాటు తెలుగులో నటించిన నళిని ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి కొన్న సంచలన విషయాలు తెలిపారు. 

చిరంజీవితో  'ఇంటిగుట్టు' .. 'సంఘర్షణ' సినిమాలు చేశానని ఆ చిత్రాలు మంచి విజయం సాధించాయని అన్నారు. 'సంఘర్షణ' సినిమాకి సంబంధించి ఒక డిస్కో సాంగ్ షూటింగు జరుగుతోంది. అప్పుడు అనుకోకుండా ఒక మిర్రర్ పగిలిపోయి చిరంజీవి కాలికి గాయమై రక్తం కారుతోంది..వెంటనే అప్రమత్తమైన టీమ్ ఆయను ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని..షూటింగ్ కేన్సిల్ చేద్దామని దర్శక నిర్మాతలు అన్నారు. కానీ చిరంజీవి మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఫస్ట్ ఎయిడ్ చేసుకుని మళ్లీ షూటింగులో పాల్గొన్నారు.

సినిమాలపై ఆయకు ఉన్న ఫ్యాషన్..డెడికేషన్ అలాంటిది..ఎంతో బాధ అయినా సరే చెప్పిన సమయానికి నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు..అందుకే ఆయన అంత గొప్ప స్థానానికి చేరుకున్నారు.  ఆ సమయంలో చిరంజీవిని చూసి ర్టిస్ట్ కి అంతటి అంకితభావం వుండాలని నాతో మా అమ్మ చెప్పింది. అలా చిరంజీవి గారిని చూసిన తరువాత నాలో అంకిత భావం మరింత పెరిగింది" అని చెప్పుకొచ్చారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: