సోషల్ మీడియాలో సెలబ్రెటీల గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది ఇట్టే వైరల్ అవుతుంది.  ముఖ్యంగా సినీ సెలబ్రెటీల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..చీమ చిటుక్కుమన్నా..సెకన్లలో వైరల్ అవుతున్నాయి. బాహుబలి, బాహుబలి2 సినిమాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ తన రేంజ్ అమాంతం పెంచేసుకున్నాడు.  రాజమౌళి దర్శకత్వంలో వచ్చి ‘బాహుబలి2’ తో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో అయ్యాడు. దాంతో భారతీయ సినిమా ఇండస్ట్రీలో మనోడికి వరుసగా ఛాన్స్ లు రావడం మొదలయ్యాయి.
Image result for prabhas baahubali
ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తాను తీయబోయే ఓ సినిమాలో ప్రభాస్ ని హీరోగా నటించమని అడిగాడట..కానీ తనకు ఎక్కువ రెమ్యూనరేషన్ అడగడంతో..అప్పట్లో వారి మద్య తేడాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే మరోసారి బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ హీరో ప్రభాస్ తో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయిందట..దీనికి కారణం ప్రస్తుతం ప్రభాస్ ‘సాహూ’ సినిమాలో నటిస్తున్నాడు. 
Related image
ఈ కారణంతో తాను కరణ్ జోహార్ సినిమాకు ఓకే చెప్పలేక పోయాడు. దీంతో ప్రభాస్, కరణ్ జోహార్ల మద్య తేడా వచ్చిందని వార్తలు దావానంలో వ్యాపించాయి.  ఈ వార్తలపై స్పందించిన ప్రభాస్..దర్శక నిర్మాత కరణ్ జోహర్ కు, తనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు వస్తున్న వదంతుల్లో ఎటువంటి వాస్తవం లేదని ప్రముఖ హీరో ప్రభాస్ స్పష్టం చేశారు. దుబాయ్ లో ‘సాహో’ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది.
Related image
ఈ సందర్భంగా అక్కడి మీడియాతో ప్రభాస్ మాట్లాడుతూ, మా ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్టుగా వార్తలు వస్తున్న విషయాన్ని కరణ్ జోహార్ తనకు ఫోన్ చేసి చెప్పారని అన్నారు.కాగా, బాలీవుడ్ కు ప్రభాస్ ను పరిచయం చేయాలని కరణ్ జోహార్ ప్రయత్నించారని, అందుకు, ప్రభాస్ అంగీకరించలేదనే వదంతులు ఇన్నాళ్లూ హల్ చల్ చేశాయి. ప్రభాస్ చేసిన తాజా ప్రకటనతో ఈ వదంతులకు చెక్ పడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: