చలన చిత్ర రంగంలో ఇటు టాలీవుడ్ నుండి అటు బాలీవుడ్ వరకు బ‌యోపిక్ ల‌ హ‌వా కొనసాగుతుంది. ఇప్పటివరకు క్రీడాకారుల, సినీప్రముఖుల జీవితాలపై బయోపిక్ లు తీసారే తప్ప రాజకీయ ప్రముఖుల జీవితాలపై ఎప్పుడూ రాలేదు. అందుకే తెలుగు ప్రజలపై ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన గొప్ప నాయకులైన ఎన్టీఆర్, వైఎస్ఆర్ లపై బయోపిక్ లను టాలీవుడ్లో రూపొందిస్తున్నారు.


కాగా ఈ రెండు చిత్రాల నిర్మాణం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఎన్టీఆర్ చిత్రానికి దర్శకుల సమస్య ఎదురవుతుంటే వైయస్ బయోపిక్ కు మాత్రం నటుల కొరత ఎదురవుతుంది. అయితే నటులు అంతా వేరే సినీమాల్లో నటిస్తూ అందుబాటులోకి రావడంలేదా అని అనుకుంటే మీరు పొరబడినట్లే ఎందుకంటే ఈ చిత్రంలోని కొన్ని పాత్రలను చేయడానికి ఆర్టిస్టులు ముందుకి రావడంలేదు. 


ఇప్పటికే వైఎస్ పాత్రకు మమ్ముట్టి, జగన్ పాత్రకు సూర్య, విజయమ్మ పాత్రకు బాహుబలి ఫేమ్ శరణ్య, కేవీపీ పాత్ర కోసం రావు రమేష్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే అప్పుడు వైఎస్ కు వ్యతిరేఖంగా ఉన్న రాష్ట్రంలోని కొందరు  రాజకీయ నాయకుల పాత్రల్లో నటించడానికి నటులు ఎవ్వరూ ముందుకి రావడంలేదంట. ఎందుకంటే దీని తరువాత ఏదయినా పరిణామాలు చోటుచేసుకోవచ్చని జంకుతున్నారట. అంతేగాక మొన్న ఒక సీనియర్ నటుడు సైతం వైయస్ రాజారెడ్డి పాత్రలో నటించడానికి నో చెప్పినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే జూన్ 18 న షూటింగ్ మొదలుపెట్టడానికి చిత్రబృందం సన్నద్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: