తెలుగు ఇండస్ట్రీలో మొదటి సారిగా సినీ తారపై తెరకెక్కించిన బయోపిక్ చిత్రం ‘మహానటి’.  అల‌నాటి అందాల న‌టి సావిత్రి జీవిత క‌థ‌ను మ‌హ‌న‌టి సినిమాగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. మే నెల 9న విడుద‌లైన ఈ సినిమా సూప‌ర్ హిట్‌గా నిలిచింది.  రిలీజ్ అయిన అన్ని థియేటర్ల సావిత్రి పాత్ర‌ను హీరోయిన్ కీర్తి సురేష్ న‌టించింది. సినిమాలో సావిత్రి పాత్రలో కనిపించిన కీర్తి సురేష్  న‌ట‌న‌కు అన్ని వైపుల నుండి ప్ర‌శంస‌లు అందుతున్నాయి. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌హ‌న‌టి క‌లెక్ష‌న్లు కూడా అదేవిధాంగా ఉన్నాయి. 
Mahanati 12 days Worldwide Collections
నాగ అన్వేష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు . కీర్తి సురేష్ సావిత్రిగా నటించగా జెమిని గణేశన్ గా దుల్కర్ సల్మాన్ నటించాడు ఇక కీలక పాత్రల్లో సమంత , విజయ్ దేవరకొండ నటించారు . ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల కు పైగా షేర్ సాధించింది మహానటి. ఈ సినిమా 12 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. 

ఏరియాల వారీగా మహానటి సాధించిన షేర్ ఇలా ఉంది :

నైజాం – 7. 85 కోట్లు
సీడెడ్ – 1. 9 కోట్లు
ఈస్ట్ – 1. 4 కోట్లు
వెస్ట్ – 0. 93 కోట్లు
ఉత్తరాంధ్ర – 2. 15 కోట్లు
నెల్లూరు – 0. 44 కోట్లు
కృష్ణా – 1. 6 కోట్లు
గుంటూరు – 1. 35 కోట్లు
ఓవర్ సీస్ – 9. 25 కోట్లు
కర్ణాటక – 15 కోట్లు
తమిళనాడు – 0 . 85 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 1. 12 కోట్లు
మొత్తం – 30. 35 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: