ఈమధ్య ఒక ప్రముఖ తమిళ పత్రిక రజినీకాంత్ రాజకీయాలలోకి వెళ్ళిపోతే దక్షిణాది సూపర్ స్టార్ గా ఎవరు మారుతారు అన్న ఆసక్తికర సర్వేను నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సర్వేలో కోలీవుడ్ టాప్ హీరోలైన సూర్య విక్రమ్ లతో పాటు మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మహేష్ ప్రభాస్ జూనియర్ పేర్లు కూడ ఉన్నట్లు సమాచారం.
PRABHAS LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఎవరూ ఊహించని విధంగా తమిళ ప్రజల మధ్య నిర్వహింప బడ్డ ఆ సర్వేలో అత్యధిక ఓట్లు ప్రభాస్ కు రావడమే కాకుండా భవిష్యత్ దక్షిణాది సూపర్ స్టార్ ప్రభాస్ అంటూ ఆపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచరించడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. ఈమధ్యనే విడుదలైన మహేష్ ‘భరత్ అనే నేను’ చెన్నై పట్టణంలో ‘బాహుబలి’ తో సమానంగా కలక్షన్స్ తెచ్చుకున్నా తమిళ యూత్ మాత్రం ప్రభాస్ కు పట్టం కట్టారు.  
PRABHAS LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ సర్వేలో 52 శాతం ఓట్లు ప్రభాస్ కు పడినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి తమిళనాడులో తన క్రేజ్ పెంచుకోవడానికి మహేష్ తన సినిమాలను తమిళంలో డబ్ చేస్తున్న విషయం తెలిసిందే. గతసంవత్సరం విడుదలైన ‘స్పైడర్’ సినిమా కోసం మహేష్ తన సొంత గొంతుతో తమిళ డబ్బింగ్ ను చెప్పడమే కాకుండా ఆమూవీని ప్రత్యేకంగా చెన్నై వెళ్ళి ప్రమోట్ చేసాడు. 
MAHESH LATEST PHOTOS IN BHARAT ANE NENU PHOTOS కోసం చిత్ర ఫలితం
తమిళనాడులో మహేష్ ఇమేజ్ పెంచుకోవడం కోసం పడుతున్న కష్టంలో సగం కూడ ప్రబాస్ పడటం లేదు. అయినా తమిళ సినీ అభిమానులు మహేష్ కన్నా ప్రభాస్ వైపు మొగ్గు చూపడం కీలక అంశంగా మారింది. ఇప్పుడు ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ తమిళ డబ్బింగ్ రైట్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడే ఆస్కారం ఉంది. అంచనాల ప్రకారం ‘సాహో’ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఈపత్రిక సర్వ్ ప్రకారం తెలుగు తమిళ ప్రేక్షకులకు సూపర్ స్టార్ గా ప్రభాస్ మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: