మహానటి సినిమా రిలీజ్ కాకముందు దీనిని పట్టించుకున్న నాధుడే లేడు. కానీ సినిమా రిలీజ్ అయినా తరువాత ఈ సినిమా చూసి అందరూ ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా బయో పిక్ అంటే ఇలా ఉండాలి అని నిరూపించారు. అయితే సినిమా రిలీజ్ కు ముందు శాటిలైట్ కు అంత డిమాండ్ ఏర్పడే లేదు. కానీ సినిమా రిలీజ్ అయిన తరువాత సినిమా హిట్ టాక్ ను స్వంతం చేసుకోవడం తో శాటిలైట్ కు ఒక్క సారిగా డిమాండ్ పెరిగి రేట్స్ కు రెక్కలు వచ్చాయి. 

Image result for mahanati images

మహానటి సినిమా శాటిలైట్ హక్కుల విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అమ్మేసారని, లేదని, మధ్యవర్తుల అగ్రిమెంట్ మాత్రం అయిందని, 11కోట్లు అని, కాదు 15 అని, కాదు, కాదు 18 అని ఇలా రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ వాస్తవం ఏమిటన్నది ఎక్కడా బయటకు రావడం లేదు. సినిమా విడుదలకు సరిగ్గా మూడు రోజుల ముందు శాటిలైట్ అమ్మకం కోసం నిర్మాతలు ప్రయత్నించిన మాట వాస్తవం. కానీ మూడు రోజుల ముందు అంటే డీల్ ఫినిష్ చేయడం కష్టం అని ఆపేసారు. 

Image result for mahanati images

అంటే అమెజాన్ కు డిజిటల్, చానెళ్లకు తెలుగు, తమిళ చానెళ్లకు తమిళం అలా. కానీ ఎక్కడా ఇంకా డీల్ ఫైనల్ కాలేదన్నది వాస్తవం. అన్ని భాషలు కలిపి కోనాలంటే సన్ నెట్ వర్క్ రంగంలోకి దిగాలి. కానీ ఆ చానెల్ ఇప్పుడు ఐపిఎల్ లో బిజీగా వుంది. విడివిడిగా అమ్మితే రేటు రాదు. ఇలా రకరకాల సమస్యలతో, ప్రస్తుతానికి ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే వుంది మహానటి శాటిలైట్ వ్యవహారం.



మరింత సమాచారం తెలుసుకోండి: