ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదం ఉంది అంటూ ఇండస్ట్రీలోని చీకటి కోణాల్ని బయటపెట్టి అసలు ఇండస్ట్రీలో తెరవెనక ఇది జరుగుతుంది అనే అపోహను నిజం అని తెలియజేసింది శ్రీరెడ్డి. ఆమె ఇదంతా కేవలం పాపులారిటీ కోసమే నానా రాచ్చ చేస్తుందన్న వారి విమర్శల నోటికి తాళం పడేలా ప్రముఖుల బండారాలను ఫోటో ప్రూఫుల రూపంలో బయటపెట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది.


అయితే ఆమె చేస్తున్న ఉద్యమం కొన్ని అనివార్య కారణాల వల్ల నీరుగారిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి బయట పెద్దగా కనిపించని ఆమె సామాజికమాధ్యమాల నుండే తాను అనుకున్నవి చెప్పేస్తూ సంచలనాకు తెరలేపుతుంది. కాగా అప్పటిలో దగ్గుబాటి సురేష్ తనయుడు దగ్గుబాటి అభిరామ్ తనతో క్లోజ్ గా ఉన్న ఫోటోలను బయటపెట్టి సంచలనం సృష్టించిన ఆమె మళ్ళీ అభిరామ్ బాగోతాన్ని బయటపెట్టింది.


అప్పుడు ఆయన కొన్ని ఫోటోలను మాత్రమే బయటకి లీక్ చేసి ట్రైలర్ చూపిస్తే ఇప్పుడు ఏకంగా సినిమా ను చూపించింది. మొదట అభి దగ్గు అనే క్యాప్షన్ పెట్టి వారు సన్నిహితంగా ఉన్నప్పటి ఒక ఆరు ఫోటోలు అప్ లోడ్ చేసిన ఆమె దాని తరువాత "నా జీవితంలో ఒక విలన్, పాపులారిటీకి కొడుకు ఇతను, దేన్నయినా నాశనం చేస్తాడు" అంటూ క్యాప్షన్లు పెట్టి  ఏకంగా వారి ఇరవై ఫోటోలను లీక్ చేసి తన ఉద్యమం ఆగలేదు అన్న సంకేతాలను చేరవేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: