రికార్డ్ కలక్షన్స్ కొల్లకొడుతూ సామాన్య ప్రేక్షకుల నుండి క్లాస్ ప్రేక్షకుల వరకు ప్రశంసలు అందుకుంటున్న ‘మహానటి’ మ్యానియా ఇప్పటికీ తగ్గకపోవడంతో ఈమూవీ కలక్షన్స్ ఇంకా స్థిరంగానే కొనసాగుతున్నాయి. చరిత్ర సృష్టిస్తున్న ఈమూవీ పై సమంత అసహనంగా ఉంది అంటూ లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. వాస్తవానికి ‘మహానటి’ విడుదల ముందు వరకు ఈమూవీలో మధురవాణి పాత్రను పోషించిన సమంతను అదేవిధంగా మరొక కీలక పాత్ర చేసిన విజయ్ దేవర కొండను హైలెట్ చేస్తూ ఈమూవీకి సంబంధించిన స్టిల్స్ విడుదల చేస్తూ వచ్చారు. 
SAMANTHA IN MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ‘మహానటి’ విడుదల అయ్యాక సీన్ మారిపోయి అందరి దృష్టి సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేశ్ పైకి వెళ్ళిపోయింది. దీనికి తగ్గట్టుగానే రాజమౌళి లాంటి టాప్ దర్శకుల నుండి అందరి ప్రశంసలు కీర్తికే దక్కుతున్న నేపధ్యంలో చాలామంది సమంత మధురవాణి పాత్రను మరిచిపోయారు. దీనితో సమంత మధురవాణి పాత్రలో ముఖ్యంగా ఈమూవీ క్లైమాక్స్ లో చాల బాగా నటించినా అందరి దృష్టి ‘మహానటి’ సావిత్రి పాత్ర వైపే వెళ్ళిపోయింది. 
SAMANTHA IN MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో ‘మహానటి’ విడుదల తరువాత తనకు ప్రాధాన్యత తగ్గింది అన్న ఫీలింగ్ సమంతలో బయలుదేరింది అని టాక్. దీనికితోడు ఈమూవీలో నాగచైతన్య అక్కినేని పాత్రలో బాగా నటించినా చాలామంది అసలు చైతూ ప్రస్తావన తీసుకు రావడం లేదు. ఈ విషయాలు అన్నీ సమంత దృష్టికి రావడంతో ఇప్పుడు ఆమె ‘మహానటి’ నిర్మాతలకు ఒక ఊహించని షాక్ ఇచ్చింది అని వార్తల హడావిడి జరుగుతోంది. 
SAMANTHA IN MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తెలుస్తున్న సమాచారం మేరకు ‘మహానటి’ మూవీ కలక్షన్స్ హవా మరో వారంరోజులు కొనసాగించాలని ఈమూవీ నిర్మాతలు సమంతతో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూను రికార్డు చేయించి ఆఇంటర్వ్యూను అన్ని ఛానల్స్ లోను ప్రసారం అయ్యేలా ఒక స్ట్రాటజీ అనుకున్నట్లు టాక్. అయితే ఈఇంటర్వ్యూ ఇచ్చే వ్యవహారంలో సమంత పెద్దగా ఆసక్తికనపరచడంలేదు అన్నవార్తలు వస్తున్నాయి. ఈవిషయమై ఈమూవీ నిర్మాతలు సమంతకు ఫోన్ చేస్తున్నా ఆమె స్పందించకుండా తప్పించుకుంటున్నట్లు సమాచారం. దీనితో ‘మహానటి’ పై సమంతకు ఏమైనా కోపం వచ్చిందా అంటూ కొందరు గాసిప్పులతో హడావిడి చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: