భారీ అంచనాల మధ్య త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘అరవింద సమేత’ కు  కాస్ట్ కట్టింగ్ సమస్యలు వెంటాడుతున్నాయి అన్నవార్తలు వస్తున్నాయి. ఈమూవీ ఫస్ట్ లుక్   బయటికి వచ్చాక ఈమూవీ పై హైప్ బిల్డ్ అవుతోంది. ఈమూవీ జానర్ గురించి మొన్నటిదాకా ఉన్న అనుమానాలకు క్లారిటీ కూడ వచ్చింది.
ARAVINDA SAMETHA FIRST LOOK PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ బడ్జెట్ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘అజ్ఞాతవాసి’ విషయంలో కాస్ట్ కటింగ్ లో చేసిన తప్పుల వల్ల ఆమూవీ బడ్జెట్ అమాంతం పెరిగిపోయి ఆమూవీ బిజినెస్ కూడ విపరీతయమైన రేట్లకు అమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. దీనితో హాసిని బ్యానర్ ఇమేజ్ దెబ్బ తినడమే కాకుండా ‘అజ్ఞాతవాసి’ డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడికి తలవొగ్గి ఈమూవీ నిర్మాతలు కొంతమేర నష్టాలు పూడ్చడమే కాకుండా  జూనియర్ తో తీయబోతున్న మూవీని ‘అజ్ఞాతవాసి’ బయ్యర్లకు తక్కువ రేట్లకు ఇస్తానని ఈమూవీ నిర్మాత రాధ కృష్ణ మాట ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
AGNATHAVASI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే పవన్ సినిమా నష్టాలను పూడ్చుకోవడానికి జూనియర్ సినిమాను చుట్టేస్తున్నారు అన్న ఫీలింగ్ తారక్ కు రాకుండా అతి జాగ్రత్తగా ఈమూవీ బడ్జెట్ విషయంలో కాస్ట్ కంట్రోల్ విధాన్నాని అమలు పరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  దీనిలో భాగంగానే  దేవిశ్రీప్రసాద్ బదులు థమన్ ను తీసుకోవడంతోపాటు ‘జ్ఞాతవాసి’ విషయంలో అవసరానికి మించి సెట్స్ కు గ్రీన్ మాట్స్ వేసినట్లుగా అలాంటి  పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహిస్తున్నట్టు తెలిసింది. 
TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
టైం కూడా తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ అవుట్ డోర్ లేకుండా పక్కా స్కెచ్ తో ఈమూవీ షూటింగ్ ఇండోర్ లోనే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాస్ట్ కటింగ్ వ్యూహాలలో భాగంగానే ఈమూవీలోని మరో కీలక పాత్రకు తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమూవీకి సంబంధించి ఇంకా మరికొంత మంది కీలకనటులు కూడా ఉండటంతో భారీ పారితోషికాలు డిమాండ్ చేయని మరికొంత మంది మంచి నటులను ఎంపిక చేసే పనిలోత్రివిక్రమ్ బిజీగా ఉన్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ‘అరవింద సమేత’ ను70 కోట్ల బడ్జెట్ లోపులో పూర్తి చేసి ‘అజ్ఞాతవాసి’ నష్టాలను ఈమూవీ ద్వారా తీర్చుకునే మాస్టర్ ప్లాన్ లో త్రివిక్రమ్ ఉన్నట్లు టాక్. దీనితో ప్రస్తుతం త్రివిక్రమ్  అనుసరిస్తున్న ఈపొదుపు చర్యల వల్ల జూనియర్ సినిమా క్వాలిటీ దెబ్బతింటుందా అంటూ ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: