తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్.  వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ‘రేయ్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రం ముందుగా రిలీజ్ అయ్యింది. మొదటి సినిమాతోనే తన నటనతో మంచి మార్కులు కొట్టేశాడు సాయిధరమ్ తేజ్. డ్యాన్స్, ఫైట్స్ పరంగా మెగా హీరోకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ మొత్తం తనలో చూపించాడు సాయిధరమ్ తేజ్. 
Image result for sai dharam tej new movie tej i love
తర్వాత ‘రేయ్’ చిత్రం రిలీజ్ అయినా పెద్దగా విజయం సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, జవాన్ లాంటి సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.  తాజాగా సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం తేజ్‌ ఐ లవ్‌ యు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో కె.ఎస్‌.రామారావు, వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ప్యారిస్‌లో చిత్రీకరించిన రెండు పాటలతో షూటింగ్‌ మొత్తం పూర్తిచేశారు.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ , టీజర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్‌ 29న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇతరు ముఖ్య పాత్రల్లో జయప్రకాష్‌, పవిత్రా లోకేష్‌, పృథ్వీ, సురేఖావాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్‌, ఛాయాగ్రహణం ఆండ్రూ, మాటలు డార్లింగ్‌ స్వామి లు నటిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: