సినిమా ఇండస్ట్రీలో 1999 నుంచి 2004 టాప్ హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగిపోయింది సిమ్రాన్. ఉత్తరాదికి చెందిన సిమ్రాన్ ని దర్శకుడు శరత్ ‘అబ్బాయిగారి పెళ్లి’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం చేశారు. హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తమిళ, తెలుగు, హిందీ, మలయాళం   బిజీ హీరోయిన్ గా మారిపోయింది.  ముందుగా మోడలింగ్ రంగంలో పనిచేసి, తరువాత సినిమాలలోకి వచ్చింది.తమిళ చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్‌స్టార్" అని పేరు తెచ్చుకొంది. 

Image result for actress simran hot

కొంత కాలంగా చిత్రం పరిశ్రమకు దూరంగా ఉంటున్న సిమ్రాన్ ఆ మద్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిందని అన్నారు..ఒకటీ రెండు చిత్రాల్లో కూడా కనిపించింది. ఆ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. తాజాగా అభిమానుల ఆరాధ్య తార సిమ్రాన్ సినీ ఇండస్ట్రీలోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇసారి అలా ఇలా కాదు.. ఏకంగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు జోడీగా నటించనున్నారు. 

Image result for actress simran hot

కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజినీ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో రజినీ సరసన హీరోయిన్‌గా సిమ్రాన్‌ నటించనున్నారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.  మొదట రజినీ పక్కన త్రిష, మీనా తదితరుల పేర్లు పరిశీలించారట. తాజాగా ఆ ఛాన్స్‌ సిమ్రాన్‌ని వరించినట్లు తెలుస్తోంది. కథా పరంగా సీనియర్ యాక్టర్ అవసరం ఉందని టాక్.

Related image

 అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ సినిమాను తెలుగులోనూ తెరకెక్కించే యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలుగులో సిమ్రాన్‌ నటించిన చివరి చిత్రం ‘జాన్‌ అప్పారావ్‌ 40 ప్లస్‌’. 2008లో విడుదలైన ఈ సినిమాలో కమెడియన్ కృష్ణభగవాన్ హీరోగా నటించారు. పదేళ్ల తర్వాత సిమ్రాన్ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: