రవితేజ, మాళవిక శర్మ హీరోయిన్లుగా కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ మసాలా మూవీ ‘నేల టిక్కెట్టు’ భారీ అంచనాల నడుమ రేపు (మే 25) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఫుల్ మాస్ ఆడియన్స్ మధ్య తన అభిమాన నటుడు తెరపై కనిపిస్తే.. విజిల్స్ వేస్తూ, తెరపైకి పూలు, కాగితాలు విసురుతుంటే ఆ హంగామాను చూసే కంటే చేస్తే ఆ థ్రిల్ ఎలా ఉంటుందో..మాటల్లో చెప్పలేం. ఇక ఈ చిట్ చాట్ లో రవితేజ, మాళవిక శర్మలతో పాటు ఇతర తారాగణం అలీ, ప్రవీణ్, ప్రియదర్శి తదితరులు కలిసి నవ్వుల పూవ్వులు పూయించారు.
Image result for nela ticket
ఈ సందర్భంగా కమెడియన్ అలీ.. రవితేజతో అవునూ మీరు నెల టిక్కెట్ లో ఎప్పుడైనా కూర్చొని అభిమాన హీరో సినిమా చూశారా అన్న ప్రశ్నకు..రవితేజ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు. ఇంట్లో బాల్కనీ టిక్కెట్టుకి డబ్బులు తీసుకుని నేల టిక్కెట్టులో సినిమా చూసేవాడిని.
Image result for nela ticket
అప్పట్లో విజయవాడలో సినిమా టిక్కెట్ల ధరలు వరుసగా.. నేల టిక్కెట్టు రూ.1.10పైసలు, బెంచి రూ. 2. 10 పైసలు, రిజల్వ్ రూ. 3.25 పైసలు, బాల్కనీ రూ. 4.25 పైసలు.. ఉండేవి. అందుకే ఒక్క బాల్కనీ టిక్కెట్టు డబ్బులు రూ. 4.25 పైసలు ఇంట్లో తీసుకుని.. రూ.1.10పైసలుతో నేల టిక్కెట్టు తీసుకుని నాలుగు సినిమాలు చూసేవాడిని.  కాకపోతే ఈ మద్య థియేటర్ల రేంజ్ కాస్త పెరగడంతో నేల టిక్కెట్ లేకుండా పోయింది.ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కళ్యాణ్ క్రిష్ణకి కూడా నేల టిక్కెట్టు గురించి బాగా తెలుసంటూ చెప్పుకొచ్చారు రవితేజ. 


మరింత సమాచారం తెలుసుకోండి: