మారుతున్న కాలం దృష్ట్యా ప్రజలు సినిమాలను సైతం కొత్త పద్ధతిలో కోరుకుంటున్నారు. కాల్పనిక సినిమా కథలను పక్కన పడేసి నిజ జీవితానికి దగ్గరగా ఉండే, విభిన్న సినిమాలను ఆదరిస్తున్నారు. మొన్న వచ్చి మంచి సక్సెస్ లను సాధించిన భలేభలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాలే ఇందుకు నిదర్శనం. అయితే తాజాగా ఒక యువ హీరో కూడా అన్నిటికంటే విభిన్న కథతో, అందులోనూ విభిన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.


ఒక మనసు, ఊహలు గుసగుసలాడే, ఛలో వంటి చిత్రాలలో నటించి, మెప్పించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న యువహీరో నాగశౌర్య ఇప్పటివరకు ఏ హీరో చేయలేని సాహసాన్ని చేయబోతున్నాడని వినికిడి. ప్రస్తుతం తాను నటించబోయే @నర్తనశాల సినిమాలో విభిన్నంగా గే పాత్రలో నటిస్తున్నాడంట. 


నిజానికి ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తి ముందుగా ఇద్దరు హీరోలకు ఈ సినిమా కథను వినిపించగా వారు నో చెప్పడంతో నాగశౌర్యకు వినిపించగా ఆయన కథ నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. అప్పట్లో రాజేంద్రప్రసాద్ వంటి నటులు లేడీ క్యారెక్టర్లు వేసినా గే పాత్రని ఎవరూ చేయలేదు. మరి ఇప్పుడు నాగశౌర్య కాస్త ధైర్యం చేసి ఈ సినిమాను చేయడానికి ముందుకి వచ్చినందుకు అందరూ అభినందిస్తున్నారు. ఇలాంటి విభిన్నకథతో వస్తున్న సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని పలువురు అశాభావం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: