బుల్లితెర స్టార్స్ గా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న జబర్దస్త్ సుడిగాలి సుధీర్, ఆ షో యాంకర్ రష్మి ఇద్దరు ఎవరికి వారు సొంత టాలెంట్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక మల్లెమాల పుణ్యమాని జబర్దస్త్ క్లిక్ అవడం అందులో ఉన్న ప్రతి ఒక్కరికి వేరే షోలు అప్పచెప్పడం జరిగింది. 


ఈ క్రమంలో సుధీర్, రష్మిల లవ్ యాంగిల్ చూసి ఇద్దరిని ఢీ షోలో పడేశారు. ఓ పక్క ప్రదీప్ మెయిన్ యాంకర్ గా ఉన్నా టీం లీడర్స్ గా వీరిద్దరి మధ్య రొమాన్స్ చూస్తూనే ఉన్నాం. అయితే తెర మీద రష్మి అంటే పడిచచ్చే సుధీర్ తెర వెనుక మాత్రం అలాంటిదేమి లేదు కాదని అంటాడు. మరి అలాంటిది ఆన్ స్క్రీన్ అలా ఎందుకు చేయడం అని కొందరు డౌట్.


రష్మి వెంట పడి పడి చివరగా ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అన్న తేడాలో లేకుండా సుధీర్ నిజంగానే రష్మి అంటే ఇష్టపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కచ్చితంగా ఇది కూడా ఆలోచించదగ్గ విషయమే అని చెప్పొచ్చు. ఎవరికో కాదు రష్మి సుధీర్ ల మూమెంట్స్ చూస్తుంతే ఎవరి ఇంట్లో వారు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందట.


జోడి మార్చితేనో లేక వారిద్దరిలో ఎవరికో ఒకరికి పెళ్లైతోనే తప్పించి ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడదు. మొత్తానికి సుధీర్, రష్మిల లవ్ కేవలం ఆన్ స్క్రీన్ వరకే ఉంటే ఓకే కాని ఎలాగు అందరు నమ్ముతున్నారు మనము కానిచ్చేద్దాం అనుకుంటేనే అసలు ప్రాబ్లెం స్టార్ట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు కొందరు.



మరింత సమాచారం తెలుసుకోండి: