హీరోయిన్ సోనమ్ కపూర్ తన పెళ్ళి అయినా సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నదని చెప్పవచ్చు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం ఎంతగా ఉందంటే వైవాహిక జీవితంలో ఎన్నో కలహాలు, అనుమానాలు రావొచ్చు. ఇది దాంపత్య జీవితానికి చేటు చేయొచ్చు. అందుకనే బెడ్ రూమ్ లో మొబైల్ ఫోన్ వాడేది లేదని సోనమ్ కపూర్ మరియు తన భర్త కండిషన్ పెట్టుకున్నారు. ఈ షరతు ఇద్దరికీ వర్తిస్తుంది. 

Image result for sonam kapoor

వివాహం తర్వాత తామిద్దరం బెడ్రూమ్‌లోకి స్మార్ట్ ఫోన్ తీసుకురాకూడదు.. అనే ఒప్పందాన్ని పెట్టుకున్నట్టుగా సోనమ్ వివరించింది. ఫోన్ వ్యవహారాలన్నీ బెడ్రూమ్ అవతలే తేలిపోవాలని.. పడకగదిలోకి ఫోన్ తీసుకురాకూడదని.. ఇద్దరికీ ఈ నియామం వర్తిస్తుందని సోనమ్ వివరించింది. బెడ్రూమ్‌కు వెళ్లే సమయానికి ఫోన్‌ని హాల్లోనే పడేసి రావడం లేదా బాత్రూమ్‌లో పెట్టేసి రావడం, బయటే చార్జింగ్ పెట్టేసి రావాలని నిర్ణయించుకున్నట్టుగా సోనమ్ వివరించింది.

Image result for sonam kapoor

వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూనే సోనమ్, ఆనంద్‌లు చాలా పరిణతి చెందిన నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. స్మార్ట్‌ఫోన్ రాకతో మనుషుల మధ్యన బంధాలు యాంత్రికం అవుతున్నాయనే అభిప్రాయాల నేపథ్యంలో కూడా వీరి నిర్ణయం ఆసక్తిదాయకమైనదే. అందరూ అనుచరించదగినదే. ఇలా ప్రాక్టికల్ గా ఆలోచించడం మంచి పరిణామం అని అందరు ఆహ్వానిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: