రవితేజ కళ్యాణ్ కృష్ణల కాంబినేషన్ లో నేను విడుదల అయిన ‘నేలటిక్కెట్టు’ మూవీకి సంబంధించి అమెరికా ప్రీమియర్ షోలను చూసిన ప్రేక్షకులు ఈమూవీ పై పెదవి విరుస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఈమూవీకి సంబంధించి ప్రస్తుతం బయటకు వస్తున్న టాక్ ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో ఈమూవీ డిజాస్టర్ మూవీగా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
సంబంధిత చిత్రం
అమెరికాలోని పలుప్రాంతాలలో  ఈమూవీ  ప్రీమియర్ షోలు ప్రారంభం అయిన నేపధ్యంలో ఈమూవీని చూసిన ఎన్ఆర్ఐ ప్రేక్షకులు  తమ  ట్విట్టర్లో ఈమూవీ పై స్పందిస్తున్న తీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. రవితేజ సినిమా అంటే మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఆశించే నేపధ్యంలో ‘నేలటిక్కెట్టు’ లో ఆ అంశాలు కూడ సరిగ్గా లేవు అన్న కామెంట్స్ వస్తున్నాయి. 
RAVI TEJA NELA TICKET MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈమూవీని చూసి ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈమూవీ బిలో ఏవరేజ్ మూవీగా మారుతుంది అని అంటున్నారు. దీనికితోడు రవితేజ సినిమాలలో సహజంగా ఎక్కువగా  కనిపించే కామెడీ కూడా ఈ మూవీలో లేకపోవడంతో ఈ సినిమా  పరమ రొటీన్ గా ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈసినిమాలో నవ్విచే సన్నివేశాలు కన్నా బోరింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని ఓవర్సీస్ ప్రేషకులు కామెంట్స్ చేస్తున్నారు. 
RAVI TEJA NELA TICKET MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో రవితేజ తన సినిమాల విషయంలో కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని రొటీన్ కథలని మాస్ మహారాజా విదిచి పెట్టకపోతే అతడి కెరియర్ పూర్తిగా డౌన్ అయ్యే ఆస్కారం ఉంది అన్న కామెంట్స్ అప్పుడే మొదలైపోయాయి. రవితేజ నుంచి వచ్చిన మరో బ్యాడ్ మూవీ ఈ  ‘నేల టిక్కెట్టు’ అంటూ కామెంట్స్ మొదలైన నేపద్యంలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఎన్ని ప్రయత్నాలు చేసిన తన సక్సస్ మ్యాజిక్ ను మాస్ మహారాజకు అందివ్వలేకపోయాడు అని అనుకోవాలి. అయితే ఈ సినిమా పై మన తెలుగు రాష్ట్రాలలోని బిసి సెంటర్ల ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారు అన్న విషయం పై ఈమూవీ ఫైనల్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది..    



మరింత సమాచారం తెలుసుకోండి: