తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో కీర్తి సరేష్ అంటే ఇప్పుడు మహానటి అంటున్నారు.  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి జీవితకథ ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’.  ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘పున్నమినాగు’ చిత్రంలో నటించిన మళియాళ నటి మేనక కూతురే కీర్తి సురేష్.  మళియాళంలో హీరోయిన్ గా అరంగెట్రం చేసిన తర్వాత తెలుగు లో ఈ అమ్మడు రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజ’ చిత్రంలో నటించింది.

ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో..తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుసగా ఛాన్స్ లు వచ్చాయి. ఈ క్రమంలోనే ‘మహానటి’ చిత్రంతో కీర్తి సురేష్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. అంతే కాదు ఈ అమ్మడు భారీ రెమ్యూనరేషన్‌ను కూడా డిమాండ్ చేసి తీసుకునే స్థాయిలో ఉంది. తెలుగులో ‘నేనూ శైలజ’ సినిమా కీర్తికి మంచి గుర్తింపు ఇచ్చింది. ఆ తర్వాత కొంత విరామంతో ఈమెకు వరస అవకాశాలు దక్కుతూ వస్తున్నాయి.

ఇలాంటి కెరీర్‌లో విశేషం ఏమిటంటే.. ఈమె నటించిన తొలి తెలుగు సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు. ఆ సినిమా పేరు ‘ఐనా ఇష్టం నువ్వు’. వాస్తవానికి నేనూ శైలజ సినిమాకు ముందే ఈ సినిమాలో నటించింది కీర్తి. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ ఇందులో హీరోగా నటించాడు. ఈ సినిమాకు బాగానే ప్రమోషన్ వర్క్‌ను కూడా చేశారు. అయితే సినిమా విడుదల మాత్రం జరగలేదు. అయితే ఈ చిత్రం రిలీజ్ కాకపోవడానికి ఆర్థిక కష్టాలే కారణం అని అంటున్నారు. తొలి తెలుగు సినిమా విడుదల కాకపోవడంతో కీర్తి కొంత నిరాశ పడి ఉండవచ్చు. 

Image result for ఐనా ఇష్టం నువ్వు


మరింత సమాచారం తెలుసుకోండి: