గత మూడేళ్లలో వరస హిట్స్ పై దూసుకుపోతున్న నాని స్పీడ్ కు ఈమధ్య వచ్చిన  ‘కృష్ణార్జున యుద్ధం’ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. అయితే వరస హిట్స్ తో నాని క్రేజ్  తార స్థాయికి చేరుకోవడంతో నాని డేట్స్ కోసం ఎదరో దర్శక నిర్మాతలు ఎదురు  చూస్తూ ఉన్నా ‘కృష్ణార్జున యుద్ధం’ ఇచ్చిన అనుభవంతో  నాని  తన భవిష్యత్ సినిమాల ఎంపిక విషయంలో తన స్పీడ్ తగ్గించాడు.
సంబంధిత చిత్రం
స్టార్ డైరెక్టర్ల అండ లేకుండానే ప్రేక్షకులలో నేచురల్ స్టార్ గా మారి తన మార్కెట్  ను 30 కోట్లకు దాటించిన నాని అక్కడి నుంచి ఎంత ప్రయత్నించినా తన సినిమాల  మార్కెట్ లో మాత్రం పైకి వెళ్లలేకపోతున్నాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో నాని టాప్ డైరెక్టర్లతో పని చేస్తే రేంజ్ పెరుగుతుందని కెరీర్ మరో స్థాయికి చేరుతుందని అందరూ అభిప్రాయపడ్డారు. దీనితో ఈవిషయాల పై దృష్టి పెట్టిన  నాని టాప్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ప్రయత్నించాడు. అలాంటి సమయంలో విక్రమ్ కుమార్ కొరటాల శివ లాంటి దర్శకుల కళ్లు నానిపై పడ్డాయి. ఈఇద్దరు స్టార్ డైరెక్టర్లతో నాని సినిమాలు చేయబోతున్నట్లు వార్తలు కూడ వచ్చాయి. వీరితో  నాని సంప్రదింపులు కూడా జరిపాడు అని వార్తలు వచ్చాయి. 
director koratala latest photos కోసం చిత్ర ఫలితం
విక్రమ్ కుమార్  సినిమా ఆల్మోస్ట్ కన్ఫమ్ అయినట్లే కనిపించింది. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు.  దీనితో  కొరటాల శివతో అయినా సినిమా ఉంటుందని నాని ఆశించాడు అని అంటారు. కెరీర్ ఆరంభం నుంచి సూపర్ స్టార్లతోనే పనిచేస్తున్న కొరటాల కూడా ఛేంజ్ కోసం నానీతో ఒక డిఫరెంట్ ఫిలిం చేయాలనిప్రయత్నించి ఈ ప్రాజెక్టుపై సీరియస్‌గానే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీనికితోడు తనతో వెంటనే సినిమా చేయడానికి ఏస్టార్ హీరో అందుబాటులో లేకపోవడంతో కొరటాల కూడ నాని గురించి తీవ్రంగా ఆలోచించినట్లు టాక్. 
hero nani latest photos in mca movie కోసం చిత్ర ఫలితం
నాని సినిమా కోసం కథ మీద కూర్చుందాం అని కొరటాల అనుకుంటుండగా అనుకోకుండా చిరంజీవి నుండి పిలుపు రావడంతో అనూహ్యంగా ఆ ప్రాజెక్టు ఖరారు కావడం జరిగిపోయింది అన్న వార్తలు ఉన్నాయి. దీనితో కొరటాల నానీకి టాటా చెప్పి మెగా కాంపౌండ్ లోకి వెళ్లి పోయాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో చిరంజీవి కొరటాల ల మూవీ ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది. ఈ పరిస్థుతులలో కొరటాల సినిమా ఉంటుందని వేరే దర్శకుల ఆఫర్లను పక్కన పెట్టిన నానికి నిరాశ కలిగించే షాక్ తగలడంతో తన స్టయిల్లో మీడియం రేంజి సినిమాను ఒక కొత్త డైరెక్టర్ తో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: