‘బాహుబలి’ తరువాత  ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ మూవీ సంగతులు వింటున్న ఇండస్ట్రీ వర్గాలు  షాక్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ గురించి అదేవిధంగా ఈమూవీ దుబాయ్ షెడ్యూల్ గురించి బయటకు వస్తున్న వార్తలు వింటున్న వారు ‘సాహో’ పై ఈ రేంజ్ ఖర్చులు ఏమిటి అన్న కామెంట్స్ చేస్తున్నారు. 
SAHO MOVIE DUBAI SHEDULE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దుబాయ్ షెడ్యూల్ కోసం సుమారు 70 కోట్లు పైన ఖర్చు పెడుతున్న ‘సాహో’ యూనిట్ అక్కడ వందలమంది వర్కర్స్ తో ఒక చిన్న సైజు కర్మాగారం నడుపుతున్నట్లు అక్కడ పరిస్థుతులు ఉన్నాయని ‘సాహో’ దుబాయ్ షూటింగ్ ను దగ్గర నుండి చూసినవారు చెపుతున్నారు. దీనికితోడు ఈమూవీ యాక్షన్ సీన్స్ లో సహజత్వం కోసం పడుతున్న తపన వల్ల దుబాయ్ షెడ్యూల్ ఖర్చు మరింత పెరుగుతోంది అని సమాచారం. 
SAHO MOVIE DUBAI SHEDULE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తెలుస్తున్న సమాచారం మేరకు దుబాయ్ షెడ్యూల్ కోసం కేవలం హోటల్ బిల్లులు విమానాల ఖర్చులకే 15కోట్లు ఖర్చుచేసారని తెలుస్తోంది. వందల సంఖ్యలో అంతమంది సిబ్బందిని అక్కడ అకామిడేట్ చేయాల్సి రావడంతో ఆమేరకు ఖర్చుకాక తప్పలేదని ఈమూవీ నిర్మాతలు చెపుతున్నట్లు తెలుస్తోంది. 
SAHO MOVIE DUBAI SHEDULE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇది ఇలా ఉండగా ఈమూవీని బాలీవుడ్ లో ప్రమోట్ చేస్తూ భారీ స్థాయిలో మార్కెట్ చేయడానికి వీలుగా ముంబాయిలో యువి క్రియేషన్స్ సంస్థ ఇటీవల ఒక పెద్ద భవనంలో తన కార్యాలయాన్ని కూడ ఏర్పాటు చేసుకుంది అని వార్తలు వస్తున్నాయి. ముంబాయిలోని సినిమా ఆఫీసుల్లో ఇది చెప్పుకోదగ్గ ఆఫీసు రేంజ్ లో అత్యంత ఖరీదైన లుక్ తో ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీనికితోడు ఈమూవీ గ్రాఫిక్స్ పై పెడుతున్న ఖర్చు లెక్కలోకి తీసుకుంటే ఈమూవీ బడ్జెట్ ఇంచుమించు ‘బాహుబలి’ రేంజ్ లో ఉందని అంటున్నారు. ‘బాహుబలి’ రికార్డుల స్థాయిలో తన ‘సాహో’ కు కలక్షన్స్ రాబట్టాలని ప్రభాస్ ప్రయత్నిస్తున్న నేపధ్యంలో ‘సాహో’ ఖర్చులు కూడ ఆ రేంజ్ లోనే ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: