నా పేరు సూర్య డిజాస్టర్ తరువాత అల్లుఅర్జున్ ఇంత వరకు ఏ సినిమా ను మొదలుపెట్టలేదు. ఈ సినిమా ఫ్లాప్ తో అల్లు అర్జున్ కు కోలుకొని దెబ్బ పడింది. అనవసరముగా కొత్త డైరెక్టర్ చేతిలో పడటం వల్ల ఇలా జరిగింది అని అల్లు అర్జున్ భాద పడుతూ ఉండొచ్చు. అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో తీస్తాడని ఇంత వరకు క్లారిటీ లేదు. మహేష్. ఎన్టీఆర్ , ప్రభాస్ , చరణ్ మరో రెండేళ్లు వరకు వారు ఫుల్ బిజీ.

Image result for allu arjun

మరో రెండేళ్ల వరకు వీరిలో ఎవరి డేట్స్‌ దొరకని పరిస్థితి. అల్లు అర్జున్‌ మినహా స్టార్‌ హీరోలెవరూ ఇప్పుడు అందుబాటులో లేరు. ఇలాంటి టైమ్‌లో డైరెక్టర్స్‌ అంతా అల్లు అర్జున్‌ కోసం క్యూ కట్టాలి. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఖాళీగా వున్న స్టార్‌ డైరెక్టర్లు కూడా అల్లు అర్జున్‌ వైపు మొగ్గు చూపడం లేదు. అల్లు కాంపౌండ్‌లో ఫ్రీడమ్‌ అంత వుండదనే గాసిప్స్‌ నేపథ్యంలో అటు వైపుగా దర్శకులు ఆసక్తి చూపించడం లేదా...!

Image result for allu arjun

లేక అల్లు అర్జున్‌కి సరిపడే కథ లేదా? 'నా పేరు సూర్య' పరాజయం పాలవడంతో క్రేజ్‌ ఫ్యాక్టర్‌ కూడా బన్నీకి అనుకూలంగా లేదు. దీంతో గతంలో కాదనుకున్న విక్రమ్‌ కుమార్‌కే అల్లు అర్జున్‌ మళ్లీ కబురు పంపాడని, అతడే బన్నీ కోసం ఒక కమర్షియల్‌ కథ సిద్ధం చేసే పనిలో వున్నాడని సమాచారం. ఒక యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చినా కానీ 'నా పేరు సూర్య' అనుభవంతో ప్రస్తుతం కొత్త దర్శకుల వైపు అల్లు అర్జున్‌ అంతగా మొగ్గు చూపడం లేదని టాక్‌


మరింత సమాచారం తెలుసుకోండి: