అల్లు శిరీష్ నటించిన సినిమాలు చెప్పుకోతగ్గ విజయాలు ఇప్పటి వరకు సాధించలేకపోయినా సోషల్ మీడియాలో నిరంతరం యాక్టీవ్ గా ఉంటూ మెగా అభిమానుల మధ్య సందడి చేయడం శిరీష్ హాబి. ఈ నేపధ్యంలో శిరీష్ రామ్ చరణ్ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. 
ALLUSIRISH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేపధ్యంలో ఒక ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. బాలీవుడ్ సినిమాలకు తీసిపోని రీతిలో ‘రంగస్థలం’ వసూళ్లు సాధించడం పై రామ్ చరణ్ తనదైన రీతిలో విశ్లేషించాడు. 
ALLUSIRISH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
‘‘సాధారణంగా మనం ఫార్ములా లెక్కల ప్రకారం ముందుకెళ్లిపోతాం. లేకపోతే ముందు సక్సెస్ కొట్టిన సినిమా స్టయిల్ నే రిపీట్ చేస్తాం. ఇలాగైతే స్టోరీ టెల్లర్స్ గా మనం పైకెదగడం సాధ్యంకాదు’’ అంటూ రామ్ చరణ్ ‘రంగస్థలం’ సక్సస్ వెనుక అనుసరించిన సీక్రెట్స్ ను బయటపెట్టాడు. చరణ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను యధాతధంగా కోట్ చేసి శిరీష్ చరణ్ లోని మెచ్యూరిటీ లెవల్స్ తనకు నచ్చాయి అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ఈ ఇంటర్వ్యూను అందరూ చదవాలి అంటూ శిరీష్ చరణ్ తరపున ప్రచారం చేస్తున్నాడు. 
ALLUSIRISH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పటి వరకు శిరీష్ కు తెలుగు ప్రేక్షకులలో సరైన గుర్తింపు రాని నేపధ్యంలో ఈ అల్లు వారి అబ్బాయి కోలీవుడ్ లో కెఎల్ ఆనంద్ దర్శకత్వంలో సూర్య మోహన్ లాల్ తో కలిపి ఒక భారీ మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు. కోలీవుడ్ ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకోవడం కోసం ‘యంగ్ మెగా స్టైలిష్ పవర్ స్టార్’ అంటూ చిరంజీవి పవన్ చరణ్ అల్లు అర్జున్ ల టైటిల్స్ ను వాడుకుంటూ చేయబోతున్న ప్రయోగం పై చాల అంచనాలు పెట్టుకున్నాడు శిరీష్..   


మరింత సమాచారం తెలుసుకోండి: