సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా అంచనాలను మించి సూపర్ సక్సెస్ అయ్యింది. స్టార్ సినిమాలకు ధీటుగా ఈ సినిమా వసూళ్ల హంగామా తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా వైజయంతి మూవీ బ్యానర్లో అశ్వనిదత్ సమర్పించగా స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మించారు. 


కీర్తి సురేష్ సావిత్రిగా నటించగా దుల్కర్ సల్మాన్ జెమిని గణేషన్ గా నటించి మెప్పించాడు. సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ కూడా స్పెషల్ రోల్స్ లో మెప్పించారు. బయోపిక్ అంటే ఏదో డాక్యుమెంటరీ సినిమాలా అన్న ఆడియెన్స్ థోరణిని మార్చి కమర్షియల్ గా సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. 


ఇక ఈ సినిమా 16 రోజుల కలక్షన్స్ వివరాలు చూస్తే సినిమా బీభత్సం ఏ రేంజ్ లో ఉందో చెప్పొచ్చు. ఏరియాల వారిగా ఈ సినిమా కలక్షన్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికి మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అక్కడ అభిమానుల మనసులను గెలిచింది.


16 రోజుల మహానటి కలక్షన్స్ వివరాలు చూస్తే..
నైజాం : 9 .15 కోట్లు
గుంటూరు : 1 .59 కోట్లు
కృష్ణ : 1 .85 కోట్లు
నెల్లూరు : 0 . 57 కోట్లు
ఈస్ట్ : 1 . 62 కోట్లు
వెస్ట్ : 1 . 15 కోట్లు
సీడెడ్ : 1.95 కోట్లు
ఉత్తరాంధ్ర : 2 .85 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం : 20.73 కోట్లు
ఓవర్సీస్  : 9 .70 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 2 .80 కోట్లు
వరల్డ్ వైడ్ మొత్తం : 33 .23 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: