స్టార్ సినిమా అయినా కుర్ర హీరో సినిమా అయినా హిట్టు ఫ్లాపు అనే సంబంధం లేకుండా తమ సినిమా సూపర్ హిట్ అని ఆఫ్టర్ రిలీజ్ డప్పు కొట్టుకుంటారు. కాని అసలు వాస్తవం అనేది ఆడియెన్స్ కు తెలుసు ఈ క్రమంలో నాచురల్ స్టార్ నాని మాత్రం తన సినిమా హిట్ అని చెబుతున్నా అది ఆడలేదు బాబాయ్ అంటూ నిజాన్ని ఒప్పుకున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నాని హీరోగా మేర్లపాక గాంధి డైరక్షన్ లో వచ్చిన సినిమా కృష్ణార్జున యుద్ధం.


వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న నాని ఫాంకు బ్రేక్ వేసిన సినిమా కృష్ణార్జున యుద్ధం. నాని డ్యుయల్ రోల్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ పై ప్రభావం చూపించలేదు. అయితే నాని కృష్ణార్జున యుద్ధం యుప్ టివిలో రాబోతుంది. దీని ప్రమోషన్స్ గా నాచురల్ స్టార్ నాని సూపర్ హిట్ మూవీ కృష్ణార్జున యుద్ధం అంటూ ప్రమోట్ చేస్తున్నారు. అయితే నాని మాత్రం ఆ సినిమా సూపర్ హిట్ కాలేదు బాబాయ్ అన్నాడు.


సూపర్ హిట్ అంత అవలేదు బాబాయ్... ఆడలేదు కూడా.. అయినా మనసు పెట్టి చేశాం.. చూసేయండి అంటూ ట్వీట్ చేశాడు. సాధారణంగా సినిమా ప్రమోషన్స్ కోసం ఎలాంటి సినిమా అయినా సరే సూపర్ హిట్ అనేస్తారు కాని నాని మాత్రం తన హిట్ కాని సినిమాను సూపర్ హిట్ అనడంపై తానే స్పందించడం విశేషం. మొత్తానికి నాని మంచితనం మరోసారి బయటపడిందని చెప్పొచ్చు. వరుసగా 7 సినిమాలు హిట్ కొట్టిన నాని కృష్నార్జున యుద్ధంతో కాస్త బ్యాక్ అయ్యాడు. 


ప్రస్తుతం నాని నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాని డాక్టర్ గా కనిపిస్తాడని టాక్. అశ్వనిదత్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి డబుల్ హ్యాట్రిక్ తర్వాత నాని ఫ్లాప్ చవిచూసిన నాని మళ్లీ రాబోతున్న సినిమాతోనే హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: