భారతీయ చలన చిత్ర రంగంలో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయిన శ్రీదేవి అకాల మరణం కోట్ల మంది అభిమానుల హృదయాలు కన్నీటి పాలు చేసింది.  ఆమె మరణం కేవలం అభిమానులే కాదు ఎంతో మంది సెలబ్రెటీలు కూడా కొంత కాలం మర్చిపోలేక పోయారు.  బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి తర్వాత ఎన్టీఆర్,ఏఎన్ఆర్,శోభన్ బాబు, కృష్ట లాంటి స్టార్ హీరోలతో నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.  తెలుగు,తమిళ, మళియాళ, కన్నడ భాషల్లో నటించిన శ్రీదేవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా నెంబర్ వన్ గా ఎదిగిపోయింది.  అక్కడే స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని వివాహం చేసుకుంది. 
Image result for govinda govinda movie\
తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.  ‘ఇంగ్లిష్ వింగ్లీష్’సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి చివరి చిత్రం మామ్.  దుబాయ్ లో బంధువుల వివాహ వేడుకకు వెళ్లి అక్కడ స్టార్ హోటల్ లో అనుకోని ప్రమాదంతో మరణించారు.  ఆమె మరణం కూడా ఇప్పటికీ మిస్టరీ అనే అంటున్నారు..కాకపోతే దుబాయ్ పోలీసులు మాత్రం ప్రమాదం వల్లే చనిపోయిందని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక శ్రీదేవిని ఎంతో అభిమానించే హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకరు. 
Image result for sridevi
ఆమెతో రెండు సినిమాల్లో నటించిన నాగార్జున శ్రీదేవి గురించి ప్రముఖ హీరో నాగార్జున ప్రస్తావించారు. శ్రీదేవి మరణించారంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, ఆమె మరణం తనకు జీవిత పాఠం నేర్పిందని ఓ ఇంటర్వ్యూలో నాగార్జున అన్నారు.శ్రీదేవి హఠాన్మరణం తనలో వ్యక్తిగతంగా మార్పు తీసుకొచ్చిందని, తనకు ప్రియమైన వారిని మరింత ప్రశంసించేలా, వారికి ఇంకా దగ్గరయ్యేలా చేసిందని చెప్పారు.
Image result for officer movie nagarjuna
ఆఫీసర్ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఆయన శ్రీదేవి గురించి ఎన్నో జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శ్రీదేవితో కలిసి తాను నటించిన 'గోవిందా గోవింద' చిత్రం గురించి ప్రస్తావించారు. ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు కెమెరా ముందు శ్రీదేవి చాలా సంతోషంగా ఉండేవారని, కెమెరా స్విచ్చాఫ్ చేస్తే ఆమె తన నిజజీవితంలోకి వచ్చేసే వారని చెప్పిన నాగార్జున, తాను నటిస్తున్నంత కాలం శ్రీదేవిని మిస్ అవుతూనే ఉంటానని ఆవేదన వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: