మాస్ డైరెక్టర్స్ లిస్టులో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న బోయపాటికి చిరంజీవితో సినిమా చేయడం జీవిత ధ్యేయం. ఆకోరిక ఎప్పటికి తీరుతుందో చెప్పలేకపోయినా చిరంజీవి నట వారసుడు చరణ్ తో బోయపాటి కోరిక తీరబోతున్న విషయం తెలిసిందే. ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ప్రస్తుతం చరణ్ నటిస్తున్న మూవీ కావడంతో ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి.
BOYAPATI ALONG WITH RAMCHARAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ అంచనాలు బోయపాటికి పెద్ద టెన్షన్ గా మారినట్లు టాక్. గతంలో చరణ్‌ సినిమాల పై భారీ అంచనాలు ఉండేవి కావు. అయితే ‘రంగస్థలం’ విడుదల అయ్యాక చరణ్ ఇమేజ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోవడంతో చరణ్ తో సినిమాలు చేయడం అంత సులవైన పనిగా కనిపించడం లేదు. ముఖ్యంగా ‘రంగస్థలం’ లోని చిట్టిబాబు పాత్ర స్థాయిలో భవిష్యత్ లో చరణ్ నటించే సినిమాలలోని అతడి పాత్రలను పోల్చి చూసుకునే ప్రమాదం ఏర్పడింది. 
RAMCHARAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
గతంలో చరణ్ సినిమాలు హిట్ అయితే చాలు అని అనుకునే అభిమానులు ఇప్పుడు అతడి నుండి బ్లాక్ బస్టర్ హిట్స్ ఆశిస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో బోయపాటి సినిమాలు అంటే ఎంతో మాస్ గా ఉండే నేపధ్యంలో చరణ్ ను బోయపాటి సినిమాలో చాల డిఫరెంట్ గా చూపించాలి అన్న ఒత్తిడి బోయపాటి పై విపరీతంగా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో బోయపాటి కూడ ఈమూవీ కథలో అనేక మార్పులు చేర్పులు చేసినా చివరకు ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుంది అన్న టెన్షన్ తో ఈ మూవీని తీస్తున్నట్లు సమాచారం. 
DIRECTOR BOYAPATI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ విపరీతమైన ఒత్తిడి ఈమూవీ ఫైనల్ అవుట్ పుట్ పై ప్రభావాన్ని చూపెడుతుందా అన్న అనుమానాలు ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. బోయపాటి గతంలో దర్సకత్వం వహించిన సినిమాలలో నటించిన హీరోలకు నటుడుగా తమని తాము నిరూపించుకునే పాత్రలు చాలామంది హీరోలకు రాలేదు.ఇలాంటి పరిస్తుతులలో బోయపాటి చరణ్ అభిమానులుకోరుకునే మరో చిట్టి బాబు లాంటి పాత్రలను క్రియేట్ చేయలేడని కేవలం ఒక రొటీన్ పాత్రనే సృష్టిస్తాడు అని వస్తున్న కామెంట్స్ కు బోయపాటి ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి...   


మరింత సమాచారం తెలుసుకోండి: