యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కాజల్ ఇద్దరి జోడి అందరికి తెలిసిందే. బృందావనం నుండి ఈ ఇద్దరి పెయిర్ స్క్రీన్ పై సంచలనాలు సృష్టించింది. కెరియర్ లో ఆటు పోట్లను ఎదుర్కున్న కాజల్ మళ్లీ ఇప్పుడు మంచి ఫాంలోకి వచ్చింది. ప్రస్తుతం రెండు మూడు సినిమా ఆఫర్లు చేతిలో ఉండగా కాజల్ ఐటంగా కూడా ఆఫర్ వస్తే ఓకే అనేస్తుంది. జనతా గ్యారేజ్ లో ఎన్.టి.ఆర్ తో పక్కా లోకల్ అంటూ ఊపు ఒప్పేసిన అమ్మడు మళ్లీ తారక్ తో ఐటం కు రెడీ అయ్యింది.


ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో రాబోతున్న అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దె మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈషా రెబ్బ కూడా సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక సినిమాలో హాట్ హాట్ ఐటం సాంగ్ లో కాజల్ కనిపించనుందట. సినిమాలో ఈ సాంగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు.


తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ ఐటం సాంగ్ అదరగొట్టడం ఖాయమని తెలుస్తుంది. జనతా గ్యారేజ్ సినిమాలో మొదటిసారి పక్కా లోకల్ అంటూ తన పరువాలకు పనిచెప్పిన కాజల్ కెరియర్ లో మరోసారి ఐటం సాంగ్ లో దర్శనమిస్తుంది. అరవింద సమేత ఈ సినిమాలో అన్ని క్రేజీ మూమెంట్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కచ్చితంగా తారక్ తన ఫ్యాన్స్ కు మరో సూపర్ హిట్ సినిమా ఇస్తాడని చెప్పొచ్చు.


ఫస్ట్ లుక్ తోనే కత్తి పట్టి నానా రచ్చ్చ చేసిన జూనియర్ ఈ సినిమాతో మరోసారి రికార్డుల పని పడతాడని అంటున్నారు. త్రివిక్రం మార్క్ అరవింద సమేతలో కాజల్ ఎంట్రీతో సినిమా మరింత కలర్ ఫుల్ గా మారుతుందని అనుకుంటున్నారు. అక్టోబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: