‘అజ్ఞాతవాసి’ సూపర్ ఫ్లాప్ తరువాత త్రివిక్రమ్ ఆషాక్ నుండి తేరుకుని జూనియర్ తో నిర్మిస్తున్న ‘అరవింద సమేత’ కధకు పరోక్షంగా పవన్ చేసిన సహాయాన్ని నిన్న త్రివిక్రమ్ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. గతంలో  తాను పవన్ కళ్యాణ్ ‘కోబలి’ అనే మూవీని రాయలసీమ నేపథ్యంలో  నిర్మించాలి అని చేసిన ప్రయత్నాల గురించి వివరిస్తూ ఆ సినిమా గురించి చేసిన పరిశోధన అనుకోకుండా ‘అరవింద సమేత’ కు కలిసివచ్చింది అని అంటున్నాడు త్రివిక్రమ్. 
ARAVINDA SAMETHA MOVIE FIRST LOOK కోసం చిత్ర ఫలితం
రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎలా మొదలైంది ఎలా రూపాంతరం చెందింది అనే విషయాలపై తాను చాల పరిశోధన చేశానని గతంలో శతృవుల పై రాయలసీమ ప్రాంతం వారు దాడి చేస్తున్నప్పుడు  ‘కోరుబల - నరుకు బలి’ అని గట్టిగా అరిచేవారని అదే వాడకంలో ‘కోబలి’ గా మారిందని త్రివిక్రమ్ చెప్పాడు. ఈకథ కోసం ఒకప్పటి పత్రికల్ని కూడా తిరగేసి తాను చేసిన పరిశోధన వివరిస్తూ రాయ‌ల‌సీమ‌కు చెందిన క‌వులు, క‌ళాకారులు, ఫ్యాక్ష‌నిస్టుల‌తో మాట్లాడిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆ రిసెర్చ్‌ ఎన్టీఆర్ సినిమా కోసం బాగా ఉప‌యోగ‌పడింది అని అంటున్నాడు. 
ARAVINDA SAMETHA MOVIE FIRST LOOK కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం తాను జూనియర్ తో తీస్తున్న ‘అరవింద సమేత’ రాయలసీమ నేపధ్యంలో జరిగే కథ కావడంతో ‘కోబ‌లి’ కోసం తాను చేసిన రాయ‌ల‌సీమ రీసెర్చ్ ఈసినిమా కోసం వాడుకుంటున్నాను అన్న లీకులు ఇచ్చాడు త్రివిక్ర‌మ్‌. రాయలసీమ యాస‌, ఊరు పేర్లు, పాత్ర‌ల పేర్లు ఇలా అన్నీ ‘కోబ‌లి’ స్క్రిప్టు నుంచే తీసుకుంటున్నాడ‌ట‌. 
KOBALI MOVIE POSTERS కోసం చిత్ర ఫలితం
రాయ‌ల‌సీమ నేపథ్యంలో సాగే’అరవింద సమేత’ లో  ప్ర‌తీ స‌న్నివేశంలోనూ తాను ‘కోబలి’ కోసం పడ్డ కష్టం కనిపిస్తుంది అని అంటున్నాడు. ముఖ్యంగా ఈమూవీకి సంబంధించిన సంభాషణలలో కొత్త సౌండింగ్ వినిపిస్తుంది అంటూ తాను ‘అరవింద సమేత’ లో చేయబోతున్న ప్రయోగాలను వివరించాడు. ఇప్పుడు ఈవార్తలు ఇలా బయటకు రావడంతో ఎప్పుడో పవన్ తో తీయాలి అనుకున్న ‘కోబలి’ ని మార్చి ‘అరవింద సమేత’ గా మారుస్తున్నాడా అంటూ జూనియర్ అభిమానులు త్రివిక్రమ్ మాటలు విని హడలిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: