త్రివిక్రమ్ అజ్ఞాతవాసి ఫ్లాప్ తరువాత మొదటి సారిగా మీడియా ముందుకు వచ్చాడు. అజ్ఞాతవాసి సినిమా గురించి. తనకు హీరోయిన్స్ కు లింక్ ల గురించి వస్తున్న ఆరోపణల గురించి మీడియా తో మాట్లాడినాడు. అయితే అజ్ఞాత వాసి సినెమా లో తప్పులు జరిగినాయి అని ఒప్పుకుంటూనే, రాజ్యం, రాజు అంటే ఓకె అనేవారని, కార్పొరేట్ స్టయిల్ లో తీయడం వల్ల ఆడలేదని అంటున్నారు. అంటే జనాల స్థాయిని త్రివిక్రమ్ తక్కువ అంచనా వేస్తున్నట్లు వుంది.

Image result for trivikram

మంచి సినిమాను జనాలు ఎప్పుడూ వదులుకోలేదు. అది పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా. తానేదో మేధావితనం రంగరించిన ఆధునిక సినిమా తీసానని, అందుకే జనాలకు నచ్చలేదని త్రివిక్రమ్ ఆత్మ వంచన చేసుకుంటున్నారేమో? ఓ పక్క తప్పులు జరగలేదని అనడం తప్పే అవుతుందని అంటూనే అజ్ఞాతవాసిని ఈ విధంగా త్రివిక్రమ్ డిఫెండ్ చేసుకోవడం అంటే ఏమనుకోవాలి?

Image result for trivikram

ఒక విధంగా త్రివిక్రమ్ తన మీద వస్తున్న గ్యాసిప్ లకు, విమర్శలకు సమాధానం ఇవ్వాలని డిసైడ్ అయి పత్రికలకు ఇంటర్వూ ఇచ్చినట్లు కనిపిస్తోంది. తనకు హీరోయిన్లతో లింక్ లు పెడుతున్నారని ఎదురు దాడి చేయడం, తనకు పవన్ కు మధ్య ఎడం పెరగలేదని, స్నేహం కొనసాగుతోందని చెప్పుకునే ప్రయత్నం చేయడం, అలాగే అజ్ఞాతవాసి ముఫై కోట్ల నష్టాలు పూడ్చేసామని ప్రకటించడం, ఇలా చాలా విషయాల మీద వివరణ కోసం త్రివిక్రమ్ ఇంటర్వూలు ఇస్తున్నట్లుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: