గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన సమంత నాగచైతన్యను పెళ్లాడిన తరువాత అక్కినేని వారి కోడలిగా చాల ఈజీగానే సెటిలైపోయింది. పెళ్లి తన కెరియర్ కు ఎటువంటి అడ్డంకు కాదు అన్న సంకేతాలు ఇస్తూ ఆమె ఇప్పటికీ వరసపెట్టి సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్స్ లిస్టులో ఆమె అగ్ర స్థానాన్ని కొనసాగిస్తోంది.
SAMANTHA ALONG WITH NAGARJUNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలాంటి పరిస్థుతులలో నాగార్జున నిన్న ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన కోడలు సమంత పై నాగ్ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. సమంతకు చైతూతో ముడిపడ్డాక సమంత చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయిపోతోంది అంటూ ఆసినిమాలవల్ల నటిగా సమంతకు వస్తున్న పేరును చూసి తాను గర్వపడుతున్నానని ఆమె చిరునామా మారి అక్కినేని కుటుంబ కోడలు అవ్వడంతో ఆమె అదృష్టం మరింత పెరిగి పోయింది అంటూ సమంత హవా వెనుక చైతన్య లక్ కారణం అంటూ వ్యూహాత్మక కామెంట్స్ చేసాడు నాగార్జున. 
SAMANTHA ALONG WITH NAGARJUNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రస్తుత పరిస్థుతులలో సమంత తన కోడలు అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెపుతూ ఆమెకు చైతన్యతో పెళ్ళి అయిన తరువాత విడుదలైన ‘మెర్శల్’ ‘రంగస్థలం’ ‘ఇరుంబుతురై’ ‘మహానటి’ లాంటి ఘనవిజయాలలో సమంత పాత్ర ఉండటం తమ కుటుంబానికి ఏర్పడ్డ గౌరవంగా ఫీల్ అవుతున్నాను అంటూ అభిప్రాయ పడ్డాడు నాగార్జున.  అంతేకాదు పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్స్ క్రేజ్ తగ్గుతుందని అయితే అందుకు భిన్నంగా సమంత క్రేజ్ పెరగడం వెనుక తమ ఇంటి పేరు అక్కినేనిలో ఉండే ఒక క్రేజ్ అంటూ నాగ్ తన కుటుంబ వారసత్వాన్ని సమంత సక్సస్ కు ఆపాధించాడు. 
సంబంధిత చిత్రం
అంతేకాదు ఆమె మున్ముందు కూడా ఇలాగే మంచి సినిమాలు చేస్తూ సాగిపోవాలని కోరుకుంటున్నాను అని నాగార్జున సమంతకు తన బెస్ట్ విషస్ చెపుతున్నాడు. వరసపెట్టి సమంత సినిమాలకు వస్తున్న సక్సస్ లో చైతన్య లక్ ఆమెకు ఎంత వరకు పనిచేసిందో తెలియకపోయినా చైతూకు సమంతను పెళ్లి చేసుకున్న తరువాత ఈ యంగ్ కపుల్ ను బ్రాండ్ అంబాసిడర్ లుగా మార్చి అనేక ప్రముఖ వాణిజ్య సంస్థలు తీస్తున్న  యాడ్స్ సంఖ్య పెరగంతో సమంత అదృష్టం పరోక్షంగా చైతన్యను తాకిందనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: