బాహుబలి సినిమా తర్వాత మెగా నందమూరి భారీ మల్టీస్టారర్ కు నాంధి పలికాడు దర్శకధీరుడు రాజమౌళి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కించాలని చూస్తున్నారు. బాహుబలితో నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ ఏర్పరచుకున్న జక్కన్న చేస్తున్న ఈ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ మీద కూడా అందరి దృష్టి ఉంది.


క్రేజీ మూవీ కాబట్టి ఈ సినిమాపై రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. వాటిల్లో వాస్తవం ఎంత అన్నది తెలియదు కాని సినిమా కథ ఇదని కొన్నాళ్లు వార్తలొచ్చాయ్. మొన్నటిదాకా సినిమా స్పొర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని.. రాం చరణ్ జాకీగా ఎన్.టి.ఆర్ బాక్సర్ గా కనిపిస్తాడని అన్నారు. అయితే ఇప్పుడు మరో కథ చెబుతున్నారు.


ట్రిపుల్ ఆర్ లో రాం చరణ్ సిఐగా కనిపిస్తాడట. ధ్రువ సినిమాలో రాం చరణ్ పోలీస్ పాత్రలో అదరగొట్టాడు. ఆ క్రేజ్ తోనే రాజమౌళి చరణ్ ను సిఐగా చూపిస్తున్నాడట. చరణ్ సిఐ కాబట్టి ఎన్.టి.ఆర్ డిటెక్టివ్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయట. తారక్ పాత్ర ఎలా ఉన్నా చరణ్ మాత్రం పవర్ ఫుల్ పోలీసే అంటున్నారు.


అక్టోబర్ లో మొదలయ్యే ఈ సినిమాపై రోజులో న్యూస్ బయటకు వస్తుంది. ఇందులో నిజం ఎంత అన్నది ఎవరికి తెలియదు. రాజమౌళి, రామారావు, రాం చరన్ ఇలా ముగ్గురు ఆర్ కు కలిసి చేస్తున్న ఈ ట్రిపుల్ ఆర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం చరణ్, ఎన్.టి.ఆర్ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: