‘బాహుబలి’ ని కట్టప్ప ఎందుకు చంపాడు అన్నప్రశ్న ‘బాహుబలి 2’ విడుదలకు ముందు ఎలాంటి సస్పెన్స్ ను కలిగించిందో అదే స్ట్రాటజీ  ప్రభాస్ తాను లేటెస్ట్ గా నటిస్తున్న ‘సాహో’ విషయంలో కూడ అనుసరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికికారణం ఈసినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్న మళయాళ నటుడు లాల్ ఈమూవీ విషయమై చేసిన ఆసక్తికర కామెంట్స్. 

‘సాహో’ మూవీ ప్రభాస్  కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా మారిన నేపధ్యంలో ఈమూవీకి సంబంధించిన వార్తలు ప్రభాస్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలకు కూడ అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. సుమారు ౩౦౦ కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీలో బాలీవుడ్ టాప్ స్టార్స్ తో పాటు మళయాళ ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు. 
SAHO MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈమూవీ పై భారీ అంచనాలు పెరిగిన నేపధ్యంలో ‘సాహో’ యూనిట్ ఈసినిమాకు సంబంధించి ‘బాహుబలి’ లో రాజమౌళి కట్టప్ప సీక్రెట్ ను నడిపినట్లుగా ‘సాహో’ కథను ఈసినిమాలో నటిస్తున్న నటీ నటులకు కూడ తెలియకుండా చాల జాగ్రత్త పడుతున్నారట. ఈవిషయాన్ని ఈమూవీలో నటిస్తున్న సీనియర్ మలయాళ నటుడు లాల్ లీక్ చేసాడు. ఈమధ్యనే లాల్ అబుదాబి షెడ్యూల్ లో జాయిన్ అయ్యాడు. ప్రభాస్ తో తీయించుకున్న ఒక ఫొటోను రిలీజ్ చేస్తూ ‘సాహో’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను లీక్ చేసాడు. తాను ఈసినిమాను ఒప్పుకుంది కథ విని కాదని కేవలం ప్రభాస్ ఈమూవీలో నటిస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకుని ‘సాహో’ లో నటిస్తున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 
సంబంధిత చిత్రం
అంతేకాదు తనకు మాత్రమే కాకుండా ఈమూవీలో నటిస్తున్న  శ్రద్ధా కపూర్ నీల్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ లాంటి ఎందరో ప్రముఖ బాలీవుడ్ నటీనటులకు కూడ ఈమూవీ కథను చెప్పకుండా కేవలం వారి పాత్రల వరకు చెపుతూ ‘సాహో’ అసలు కథ విషయమై టాప్ సీక్రెట్ కొనసాగిస్తున్నారు అంటూ లాల్ కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈవార్తలు ఇలా బయటకు రావడంతో ప్రభాస్ రాజమౌళి స్ట్రాటజీని అనుసరిస్తున్నాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: