త్రివిక్రం ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత వీరరాఘవ సినిమాలో వీర రాఘవగా ఎన్.టి.ఆర్ తన సత్తా చూపించనున్నాడు. మొదటి లుక్ తోనే సిక్స్ ప్యాక్ బాడీతో అందునా చేతులో కత్తితో అదరగొట్టేశాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.


సినిమాలో సెకండ్ లీడ్ గా ఈషా రెబ్బ కూడా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కథకు త్రివిక్రం పవన్ కళ్యాణ్ తో తీయాలనుకున్న కోబలి సినిమాకు దగ్గర్ పోలికలు ఉన్నాయని స్వయాన డైరక్టర్ త్రివిక్రం అనడం జరిగింది. కోబలి సినిమా కోసం రాయలసీమ రక్త చరిత్ర అదేనండి ఫ్యాక్షన్ అనేది ఎక్కడ మొదలైంది.. ఎందుకు మొదలైంది అన్న అంశాల మీద కథ సిద్ధం చేసుకున్నాడట త్రివిక్రం.


శత్రువులపై దాడి చేసేప్పుడు వారు కసితో కోరు బలి.. నరుకు బలి అంటారట. ఇదే కోబలి టైటిల్ కు కారణం అయ్యింది. ఇక ఈ సినిమా చేసే టైం కు 2014 ఎలక్షన్స్ రావడం పవన్ తర్వాత చూద్దాం అన్నాడట. అయితే ఎన్.టి.ఆర్ తో చేస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా కూడా ఫ్యాక్షన్ స్టోరీతో వస్తుంది.


ఈ సినిమాకు కోబలి కథ రిఫరెన్స్ గా వాడుకున్నానని చెప్పాడు త్రివిక్రం. అయితే పవన్ తో కోబలి సినిమా 2019 ఎలక్షన్స్ తర్వాత అయినా చేయాలని అంటున్నాడు. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు కాబట్టే ఆడలేదని తన తప్పు ఒప్పుకున్నాడు త్రివిక్రం శ్రీనివాస్.



మరింత సమాచారం తెలుసుకోండి: