గ్లామర్  ఫీల్డ్ లో నిలదొక్కోవడమన్నది చాలా కష్టంతో కూడిన వ్యవహారం. ఒక సినిమా అవకాశాన్ని పట్టాలంటే దాని వెనక చాలా శ్రమతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అందులోనూ హీరోయిన్ల పరిస్థితి అయితే ఇంకా దారుణం. పొరపాటున ఏదయినా సినిమా ప్లాప్ అయితే చాలు ఐరన్ లెగ్ అంటూ పక్కన పెట్టేస్తారు. ఇంకా అలాంటి వారు చేసేదేమీ లేక అందాలు ఆరబోస్తే అయినా అవకాశం రాకుండా పోదా అంటూ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉంటారు.


తాజాగా ఈ అందాల ఆరబోత వర్గంలో ముందుంటుంది వరుణ్ తేజ్ హీరోయిన్ దిశాపటాని. కెరీర్ తొలినాళ్లలో మోడలింగ్ చేసుకుంటున్న ఈమెకు మూడేళ్ళ క్రితం దర్శకుడు పూరి లోఫర్ సినిమాలో ఛాన్సు ఇచ్చాడు. అయితే ఆ సినిమా భారీ ప్లాప్ ను మూటగట్టుకోవడంతో అసలు ఇప్పటివరకు ఏ తెలుగు దర్శకుడు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. బాలీవుడ్లో కూడా రెండు, మూడు  అవకాశాలు తప్ప ఈ అమ్మడుకు పెద్దగా సినిమాలు లేవు.


మొన్న విడుదలయిన భాగీ 2 పెద్ద హిట్ అయినా ఈ బ్యూటీ కి సినిమా అవకాశాలే రావడంలేదు. దీంతో చేసేదేమీ లేక స్కిన్ షోతో అవకాశాలు రాబట్టడానికి సిద్దమయిపోయింది. మొన్నటికి మొన్న బీచ్లో నల్ల బికినీ వేసుకొని కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వకుండా చేసిన ఈ సుందరి ఇప్పుడు మళ్ళీ బికినీలో రెచ్చిపోయింది. ప్రస్తుతం సమ్మర్ ని ఎంజాయ్ చేస్తున్న అమ్మడు ఒక బీచ్లో బికీనీ వేసుకొని తన అందాలన్నిటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అసలే కుర్ర హీరోయిన్, అందులోనూ బికినీలో మత్తెక్కిస్తుండడంతో కుర్రాళ్ళు ఆమె ఫోటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. మరి ఈ అందాల ఆరబోత ఎన్ని అవకాశాలను ఇస్తుందో చూద్దాం! 


మరింత సమాచారం తెలుసుకోండి: